తమిళనాడు-రెండు రాజధానులు

రాజధానుల వికేంద్రీకరణ అన్నది తెలుగునాట నుంచి తమిళనాడుకు పాకినట్లు కనిపిస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే మధురై ను రెండో రాజధాని చేస్తానని నటుడు/నాయకుడు కమల్ హాసన్ ప్రకటించారు.  Advertisement ఒకప్పుడు తమిళుల రాజధానిగా…

రాజధానుల వికేంద్రీకరణ అన్నది తెలుగునాట నుంచి తమిళనాడుకు పాకినట్లు కనిపిస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే మధురై ను రెండో రాజధాని చేస్తానని నటుడు/నాయకుడు కమల్ హాసన్ ప్రకటించారు. 

ఒకప్పుడు తమిళుల రాజధానిగా మదురై వుండేదని, దానిని తాము మళ్లీ పునరుద్దరిస్తామని కమల్ ప్రకటించారు. మక్కల్‌ నీదిమయ్యం అధికారంలోకి వస్తే అధికారులంతా ప్రజలవద్దకే వెళ్ళి వారి సమస్యలను పరిష్కరిస్తారని, అంటే ప్రజల వద్దకే పాలనను అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కమల్‌హాసన్‌ చెప్పారు.

కమల్ హాసన్ పార్టీ అధికారంలోకి వస్తుందో, రాదో కానీ మధురై ప్రాంత ప్రజల్లో మాత్రం రాజధాని ఆశలు పెరుగుతాయి. భవిష్యత్ లో ఇది అలా అలా పెరిగి డిమాండ్ గా మారుతుంది. 

వైఎస్ జగన్ తీసుకున్న రాజధానుల వికేంద్రీకరణ, ఆర్టీసీ ప్రభుత్వం తీసుకోవడం లాంటి నిర్ణయాలు మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బెంగళూరు లాంటి  ప్రాంతాల్లో ఆర్జీసీని ప్రభుత్వం తీసుకోవాలని ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

అటూ ఇటూ ఎటూ కాలేక!