విడాకుల అంశంపై తొలిసారి బాధపడ్డాను – నాగచైతన్య

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలా రోజులైంది. కానీ ఇప్పటికీ మీడియాలో వీళ్ల విడాకుల అంశం అప్పుడప్పుడు ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా శోభిత ధూలిపాళ రాకతో ఈ అంశం మరోసారి హాట్…

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలా రోజులైంది. కానీ ఇప్పటికీ మీడియాలో వీళ్ల విడాకుల అంశం అప్పుడప్పుడు ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా శోభిత ధూలిపాళ రాకతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. దీనిపై తాజాగా శోభిత క్లారిటీ ఇచ్చింది. తను ఏ తప్పు చేయలేదంది.

ఇప్పుడీ అంశంపై నాగచైతన్య కూడా స్పందించాడు. శోభిత ఏ తప్పు చేయలేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. మూడో వ్యక్తి పేరు తెరపైకి రావడంతో, విడాకుల అంశంపై తొలిసారి బాధపడ్డానని కూడా అన్నాడు.

“నా వ్యక్తిగత జీవితంలో నా పెళ్లి ఫెయిల్ అవ్వడం దురదృష్టకరం. సమంతతో ప్రేమ, పెళ్లి, కలిసున్న జీవితం.. నా లైఫ్ లో ఆ ఫేజ్ పై చాలా గౌరవం ఉంది. అయితే విడాకుల అంశంపై మీడియా ఇచ్చిన కథనాల వల్ల పబ్లిక్ దృష్టిలో ఆ గౌరవం పోయింది. విడాకులు తీసుకొని ఏడాది పైన అయింది. కానీ ఇంకా మీడియా కథనాలు ఇస్తోంది, మూడో వ్యక్తి పేరును కూడా ఈమధ్య తీసుకొస్తోంది. ఇది నాకు చాలా బాధగా అనిపించింది. ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తి నా విడాకుల అంశం వల్ల ఇబ్బంది పడుతుండడం చూసి చాలా బాధ అనిపిస్తోంది.”

ఇకనైనా మీడియా తన విడాకుల అంశాన్ని వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు నాగచైతన్య. సినిమాలతో తను ప్రజలను ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నానని, తన వ్యక్తిగత జీవితంలో ఎంటర్ టైన్ చేయాలని అనుకోవడం లేదంటూ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు.

“విడాకులు నాకు, సమంతకు సంబంధించిన అంశం. అది అయిపోయింది. ఇంకా సాగదీయడం తప్పు. థర్డ్ పార్టీ పేరును ప్రస్తావించడం ఇంకా తప్పు. వాళ్లకు కూడా కుటుంబాలుంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. నన్ను ఏమన్నా అనండి, నేను భరిస్తాను. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా చుట్టూ ఉన్న వ్యక్తులకు ఆపాదించకండి. వాళ్ల గౌరవాన్ని భంగపరచకండి.”

తనపై వస్తున్న పుకార్లను పట్టించుకోవడం మానేశానంటున్నాడు నాగచైతన్య. తన మైండ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ గా ఉంటుందని, వదిలేయాలనుకున్న అంశాన్ని మైండ్ లోంచి వెంటనే కట్ చేసేస్తానని అన్నాడు. అలా కట్ చేయడం కూడా చాలా కష్టమని, ఎన్నో ఏళ్లు కష్టపడి తను అది నేర్చుకున్నానని అంటున్నాడు.