డీజీపీని మామ‌, పెద్ద‌య్య అనే వారుగా క‌మ్మ నేత‌లు!

ఏపీ ప్ర‌భుత్వ అధికారిక నియామ‌కాల విష‌యంలో కూడా కులం కోణం పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ కొత్త డీజీపీ నియామ‌కం గురించి వార్త రాగానే.. మొదట కులం గురించినే చ‌ర్చ జ‌రిగింది. కొత్త…

ఏపీ ప్ర‌భుత్వ అధికారిక నియామ‌కాల విష‌యంలో కూడా కులం కోణం పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ కొత్త డీజీపీ నియామ‌కం గురించి వార్త రాగానే.. మొదట కులం గురించినే చ‌ర్చ జ‌రిగింది. కొత్త డీజీపీ రెడ్డి కావ‌డంతో టీడీపీ వ‌ర్గాలు క‌ళ్లెగ‌రేశాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రెడ్ల‌కు పెద్ద ఎత్తున ప‌ద‌వులు ద‌క్కాయ‌నే ఆరోప‌ణ‌ను టీడీపీలోని కొన్ని వ‌ర్గాలు చేస్తూ ఉంటాయి. అలాగే జ‌గ‌న్ వ్య‌తిరేక వ‌ర్గాలు కూడా ఈ నియామ‌కాల‌ను హైలెట్ చేస్తూ ఉంటాయి. రాజ‌కీయ నియామ‌కాల ను ప‌క్క‌న పెడితే, అధికారుల విష‌యంలో కులం కోణం అంత స‌మ‌ర్థ‌నీయం కాదు.

డీజీపీ నియామ‌కం అనేది కేవ‌లం కులం అర్హ‌త ద్వారానో, జ‌గ‌న్ అనుకుంటేనో జ‌రిగి పోయే ప‌ని కాదు. కేవ‌లం సీనియారిటీని బ‌ట్టే ఇలాంటి అవ‌కాశాలు దొరుకుతాయి. ఒక‌వేళ మ‌రో సీనియ‌ర్ ను ప‌క్క‌న పెట్టి జ‌గ‌న్ ఒక రెడ్డికి ఈ అవ‌కాశం ఇచ్చాడ‌నే వాద‌న వినిపించినా, అందులో ప‌స ఉండ‌దు. ఒక‌వేళ అదే జ‌రిగితే, అధికారులు కోర్టుల‌ను ఆశ్ర‌యించిన వైనాలు కూడా ఉన్నాయి. తాము అర్హులం అయిన‌ప్ప‌టికీ, త‌మ జూనియ‌ర్ కు అవ‌కాశం ఇచ్చారంటూ వారు త‌మ శాఖాప‌ర‌మైన ఫిర్యాదుల‌కు వెళ్లే అవ‌కాశం ఉండ‌నే ఉంది. అలాగే కోర్టుల‌ను కూడా ఆశ్ర‌యించ‌వ‌చ్చు.

ఒక‌వేళ ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక రెడ్డిని సీనియారిటీ కాకుండా కులం అర్హ‌త‌తో డీజీపీగా చేసి ఉంటే, దానిపై స‌ద‌రు శాఖ నుంచినే అభ్యంత‌రాలు వెళ‌తాయి. త‌మ అవ‌కాశాన్ని దెబ్బ‌తీశార‌ని శాఖాప‌ర‌మైన ఫిర్యాదులు వెళ‌తాయి. కోర్టును కూడా ఆశ్ర‌యిస్తారు. మ‌రి అలాంటివి ఏమీ లేవు కొత్త డీజీపీ నియామ‌కం విష‌యంలో. కాబ‌ట్టి, సీనియారిటీ, స‌మ‌ర్థ‌త ప్రాతిపదిక‌గా కాకుండా కుల ప్రాతిపదిక‌న ఈ ఎంపిక జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక ఇక్క‌డే మ‌రో అంశాన్ని కూడా ప్ర‌స్తావించుకోవ‌చ్చు. తెలుగుదేశం పార్టీ హ‌యాంలో కూడా ఇలాంటి ఎంపిక ఒక‌టి జ‌రిగింది. అప్పుడు కూడా స‌రిగ్గా డీజీపీ ఎంపికే. తెలుగుదేశం పార్టీ 2014 లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక డీజీపీ వ‌చ్చారు. ఆయ‌న రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన ఐపీఎస్. పోలిస్ శాఖ‌లో సీనియ‌ర్. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ఆయ‌న డీజీపీగా నియామ‌కం కాగానే.. ఇలాంటి అభ్యంత‌రాలు ఏమీ రాలేదు. కులం ఆధారంగా ఎంపిక చేశారంటూ ఎవ్వ‌రూ విమ‌ర్శించ‌లేదు.

అక్క‌డే మ‌రో విశేషం కూడా ఉంది. అదేమిటంటే.. స‌ద‌రు డీజీపీ అధికారిక హోదాలో ఉండ‌గా.. అనంత‌పురం జిల్లా టీడీపీ నేత‌లు కొంద‌రు ఆయ‌న‌ను అతిగా ఓన్ చేసుకునే వాళ్లు. అనంత‌పురం జిల్లాకు చెందిన క‌మ్మ టీడీపీ నేత‌లు.. నాటి ఏపీ డీజీపీని మామ‌, పెద్ద‌య్య అంటూ ఆప్యాయంగా పిలుచుకునే వాళ్లు! వాళ్లూ వాళ్లూ ఏమీ బంధువులు కాదు. కేవ‌లం ఒకే సామాజిక‌వ‌ర్గం. 

టీడీపీ లో వారు క్రియాశీల‌కంగా ఉన్నారు. ఆయ‌నేమో డీజీపీ. ఈ బంధంతో వాళ్లు ఆయ‌న‌ను మామా, అని పెద్ద‌య్య అని త‌గిన వ‌ర‌స ఎంచుకుని పిలుచుకునే వారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో కూడా డీజీపీ త‌మ మామే అని, పెద్ద‌య్య అని చెప్పుకోవ‌డం, అంద‌రి ఎదురుగా అలాగే పిల‌వ‌డం కూడా జరిగేది! ఇదీ కుల బంధం.

మ‌రి అప్పుడేమో తమ హ‌యాంలో త‌మ సామాజిక‌వ‌ర్గం వ్య‌క్తి డీజీపీ అయితే ఆయ‌న్నేమో అధికారిక హోదాను ప‌క్క‌న పెట్టి బంధుత్వం క‌లుపుకుని మ‌రీ వ‌ర‌స‌లు పెట్టి పిలుచుకున్నారు. ఇప్పుడు ఒక రెడ్డి ఐపీఎస్ అధికారి ఏపీ డీజీపీ అయితే మాత్రం ఇందులో కులం క‌నిపిస్తూ ఉంది! ఇదే కాబోలు తెలుగుదేశం నీతి!

2 Replies to “డీజీపీని మామ‌, పెద్ద‌య్య అనే వారుగా క‌మ్మ నేత‌లు!”

  1. ఇంత మంది తో . ఒక్క జగన్ ఎలా పోరాడుతాడు?

    1) 80-90% film industry belongs to Babu k-Batch   

    2) 90% schools and colleges are belongs to Babu k-Batch   

    3) 60-70% business mans are belongs to Babu k-Batch   

    4) 60-70% of the hotel business belongs to Babu k-Batch . 

    5) 80-90% TV channels are belongs to Babu k-Batch   

    6) 60-70% real estate property are belongs to Babu k-Batch   

Comments are closed.