గంటా కోసం వెయిట్ చేయాల్సిందేనా…?

టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది రెండు దశాబ్దాలకు పైదాటిన రాజకీయం. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఏపీవ్యాప్తంగా తన అనుచరులను పెంచుకున్నారు. ఇక మూడేళ్ళుగా ఆయన టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉన్నా లేటెస్ట్…

టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది రెండు దశాబ్దాలకు పైదాటిన రాజకీయం. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఏపీవ్యాప్తంగా తన అనుచరులను పెంచుకున్నారు. ఇక మూడేళ్ళుగా ఆయన టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉన్నా లేటెస్ట్ గా ఆయన వేసిన ఎత్తుగడలతో ఆయన మరోమారు హాట్ టాపిక్ అవుతున్నారు.

ఏపీలో ఉన్న సామాజిక పరిస్థితులు, ఇతర పరిణామాలతో తన రాజకీయాన్ని జోరెత్తించాలని గంటా భావిస్తున్నారు. ఆయన ఈ మధ్య తరచుగా కాపు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ విషయంగా ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే గంటా పొలిటికల్ కెరీర్ కి ట్రంప్ కార్డు ఒకటి  చేతిలో ఉంది. దాంతో ఆయన పార్టీలను పట్టించుకోవడంలేదని ప్రచారం సాగుతోంది. తన అవసరమే ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుందని గంటా భావిస్తున్నారా అన్నది కూడా ఇక్కడ చూడాలని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఏపీలో గట్టి నాయకుల పేర్లు వేళ్ల మీద లెక్కబెడితే అందులో గంటా చాలా ముందు వరసలో ఉంటారని అంటారు. అలాంటి గంటాను వదులుకునే సీన్ అయితే టీడీపీకి లేదనే చెబుతున్నారు. గంటా వంటి నేతలు టీడీపీకి ఇపుడున్న పరిస్థితుల్లో అవసరం అని కూడా అంటున్నారు. అందుకే గంటా కోసం ఎవరైనా వెయిట్ చేయాల్సిందే అన్న చర్చ సాగుతోంది.

తనకంటూ ఒక పొలిటికల్ విజన్ పెట్టుకుని ముందుకు సాగుతున్న గంటా ఒక విధంగా ఇపుడు తన రూట్ చూసుకుంటున్నారని అంటున్నారు. సో టీడీపీ అధినాయకత్వం గంటా తమతోనే అంటోంది. మరి గంటా అయితే అన్ని ఆప్షన్లను దగ్గర ఉంచుకుని సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకుంటారు అన్నది అనుచరుల మాటగా ఉంది.