అన్ని సబ్జెక్టుల్లో వందకు వంద.. సరికొత్త రికార్డ్

సాధారణంగా లెక్కల్లో వందకు వంద వస్తాయి. ఈమధ్య సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో కూడా వందకు వంద మార్కులు వేస్తున్నారు. కానీ ఫస్ట్ లాంగ్వేజ్, సెకెండ్ లాంగ్వేజ్ లో మాత్రం వందశాతం మార్కులు వేయరు. ఇప్పుడు…

సాధారణంగా లెక్కల్లో వందకు వంద వస్తాయి. ఈమధ్య సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో కూడా వందకు వంద మార్కులు వేస్తున్నారు. కానీ ఫస్ట్ లాంగ్వేజ్, సెకెండ్ లాంగ్వేజ్ లో మాత్రం వందశాతం మార్కులు వేయరు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది. తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయి, అన్ని సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు తెచ్చుకుంది.

తమిళనాట ఈరోజు 12వ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో దిండిగుల్ జిల్లాకు చెందిన నందిని అనే అమ్మాయి.. 600 మార్కులకు గాను ఏకంగా 600 మార్కులు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

తమిళ్, ఇంగ్లిష్, ఎకనమిక్స్, కామర్స్, ఎకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు రాసిన ఈ అమ్మాయి.. ప్రతి సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు సాధించింది. చివరికి తమిళ్, ఇంగ్లిష్ లాంటి లాంగ్వేజెస్ లో కూడా ఆమెకు మార్కులు తగ్గకపోవడం విశేషం.

స్థానికంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో చదువుకుంది నందిని. ఇతడి తండ్రి ఓ సాధారణ కార్పెంటర్. చిన్నప్పట్నుంచి నందిని చదువులో చురుకు. పైగా ఎకౌంట్స్, కామర్స్ అంటే ప్రాణం. పెద్దయిన తర్వాత ఆడిటర్ ను అవుతానంటోంది నందిని.

ఈ ఏడాది ఫలితాల్లో నందినితో పాటు మరికొంతమందికి కూడా తమిళ్, ఇంగ్లిష్ లో వందకు వందమార్కులు వచ్చినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రతి సబ్జెక్ట్ లో వంద మార్కులు తెచ్చుకున్నది మాత్రం నందిని మాత్రమేనని, రాష్ట్రంలో ఇదో రికార్డ్ అని ప్రకటించారు.