పని చేయకపోతే ఓట్లేయవద్దు…జగన్ బాటలో మంత్రి

జగన్ పొలిటికల్ గా ట్రెండ్ సెట్టర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఆయనది ఒక ప్రత్యేక పంధా. గత కాలం నాయకులను అనుసరించరు. ఆ విధానాలను అసలు ఫాలో కారు. తాను కొత్తగా ఆలోచిస్తారు.…

జగన్ పొలిటికల్ గా ట్రెండ్ సెట్టర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఆయనది ఒక ప్రత్యేక పంధా. గత కాలం నాయకులను అనుసరించరు. ఆ విధానాలను అసలు ఫాలో కారు. తాను కొత్తగా ఆలోచిస్తారు. అలాగే ముందుకు సాగుతారు. అందుకే జగన్ ప్రతీ సభలోనూ నేను చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నాను. హామీలు అన్నీ కూడా నెరవేరుస్తున్నాను.

నేను చెప్పినవి చేశాను అని నమ్మకం మీకు ఉంటేనే ఓట్లేయండి అని డేరింగ్ గా స్టేట్మెంట్ ఇస్తూంటారు. ఇపుడు ఆయన బాటలోనే ఒక మంత్రి గారు భారీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో అనకాపల్లిలోని మూలపేట ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ప్రజలు తమ ప్రాంతానికి రోడ్డు లేదని, కాలువల నిర్మాణం లేదని మంత్రికి చెప్పుకున్నారు.

తక్షణం వాటిని నిధులను మంత్రి మంజూరు చేశారు. అంతే కాదు అనకాపల్లి పర్యటనలో అనేక చోట్ల ప్రజలను కలిశారు. తాను దశల వారీగా అన్ని పనులూ  చేస్తానని వారికి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అని మంత్రి పేర్కొన్నారు.

తాను రోడ్లు వేస్తానని, మౌలిక సదుపాయాలు కల్పిస్తాను అని ఆయన చెబుతూ ఒక వేళ తాను చెప్పిన పని చేయకపోతే మీ ఓట్లు నేను అడగను, నాకు ఓట్లేయవద్దు అని బోల్డ్ గా మంత్రి చెప్పడంతో ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతు అయింది. తాను మాటల మనిషిని కాదని, సమస్యలు తెలుసుకోవడం పరిష్కరించడం కోసమే గ్రామాలలో పర్యటిస్తున్నాను అని గుడివాడ చెప్పారు.

తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటికీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ పధకాలు అందాలని, ఒకవేళ అందకపోతే వారిని గుర్తించి లబ్దిదారుల జాబితాలో చేర్చాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ చూస్తూంటే జగన్ మాదిరిగానే గుడివాడ కూడా చెప్పిన పనిని తప్పకుండా పూర్తి చేస్తాను అని నిబ్బరంగా చెబుతున్నారని అంటున్నారు.