ఆదిపురుష్..పురాణ పూనకాలు లోడింగ్

ఆదిపురుష్ ట్రయిలర్ చూసేసారు కొందరైనా. ఏదో సందుల్లోంచి, తలకాయల మధ్యల్లోంచి వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో షేర్ చేసేసుకున్నారు.  Advertisement ఆ పైరైటెడ్ ట్రయిలర్ వీడియో చూస్తుంటే సినిమా కచ్చితంగా పిల్లలను, పెద్దలను అలరించేలా…

ఆదిపురుష్ ట్రయిలర్ చూసేసారు కొందరైనా. ఏదో సందుల్లోంచి, తలకాయల మధ్యల్లోంచి వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో షేర్ చేసేసుకున్నారు. 

ఆ పైరైటెడ్ ట్రయిలర్ వీడియో చూస్తుంటే సినిమా కచ్చితంగా పిల్లలను, పెద్దలను అలరించేలా కనిపిస్తోంది. గ్రాఫిక్స్ కు సంబంధించి మంచి స్టోరీ బోర్డ్ వేసుకుని పిక్చరైజ్ చేసినట్లు కనిపిస్తోంది. 

మనకు తెలుసున్న కథనే. మన రామాయణమే, కానీ పెట్టే ఫ్రేమ్ లు కాస్త కొత్తగా, చేసిన గ్రాఫిక్స్ ఆసక్తికలిగించేలా జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా రామాయణంలోని యుద్దకాండ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. యుద్ద సన్నివేశాలు ట్రయిలర్ లో లేవు కానీ, రామసేతు..సంజీవినీ పర్వతం, వానర సేన విన్యాసాలు, ఇలాంటివి అన్నీ ట్రయిలర్ లో చోటు చేసుకున్నాయి. 

మరో కీలకమైన సంగతి ఏమిటంటే డైలాగులు. కేవలం రామాయణాన్ని బేస్ చేసుకుని, సంస్కృత మూలం నుంచి తెచ్చుకున్న డైలాగులు కాకుండా, ఈ జనరేషన్ కు అర్థం అయ్యేలా, అర్థవంతంగా వుండేలా మార్చుకున్నారు.

బయటకు వచ్చినవి పైరేటెడ్ ట్రయిలర్ వీడియో లే కనుక గెటప్ లు ఎలా వున్నాయి లాంటి వాటి మీద ఎక్కువగా చెప్పడానికి అవకాశం లేదు. కానీ టీజర్ తో పోల్చుకుంటే మరీ ఎక్కువగా కాదు కానీ చిన్న చిన్న మార్పులు చేసినట్లు కనిపిస్తోంది.