మంత్రికి షాకిచ్చిన చిన్నారులు

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల నియోజకవర్గంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న సచివాలయాన్ని తనిఖీ చేశారు పనిలో పనిగా అంగన్ వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న చిన్నారులతో మంత్రి…

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల నియోజకవర్గంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న సచివాలయాన్ని తనిఖీ చేశారు పనిలో పనిగా అంగన్ వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న చిన్నారులతో మంత్రి గారు ముచ్చటించారు.

అందరికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతోందా అని నేరుగా చిన్నారులనే అడిగి జవాబు రాబట్టారు మంత్రి. మీ ఇంటి కంటే ఇక్కడ బాగుందా అంటే వారు అవునూ అని సమాధానం చెప్పి మంత్రికి ఆనందం కలిగించారు. మీకు ఈ భోజనంలో పధార్ధాలు అన్నీ ఎవరు పంపిస్తున్నారు అన్న ప్రశ్నకు జగన్ మామయ్య అంటూ చిన్నారులు కోరస్ గా చెప్పడంతో ముత్యాలనాయుడు ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు.

జగన్ మామయ్యను మీరు చూశారా అంటే టీవీల్లో చూశామని వారు చెప్పడమే కాదు అంగన్ వాడి తరగతి గదిలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని చూపించడంతో మంత్రి గారికి హుషార్ వచ్చేసింది. తాను తెచ్చిన చాక్లెట్లు బిస్కట్లు వారికి పంచిపెడుతూ ఇవన్నీ జగన్ మామయ్య మీకు ఇవ్వమని పంపించారు అని చెప్పడంతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.

అంగన్ వాడీలలో పిల్లలను ఎలా చూసుకుంటున్నారు. వారికి అక్కడ ఏమేంటి నేర్పిస్తున్నారు అన్న దాని మీద బూడి ముత్యాలనాయుడు తనిఖీ చేసి సంతృప్తి చెందారు. పిల్లలు జగన్ మామయ్య అంటూ చెప్పడంతో మంత్రి చూశారా వీళ్లంతా అంటూ అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులతో చెప్పి మరీ మురిసారు. 

జగన్ ఏమి చేస్తున్నారు అని విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తాయి కదా చిన్నారులకు కూడా ఆయన చేస్తోంది ఏంటో అర్ధమవుతోంది. కానీ రాజకీయం చేయాలనుకునే వారికి తెలియదు అంటున్నారు మంత్రి వెంట వచ్చిన అనుచరులు.