అమ్మఒడిలో అక్రమాలు.. కార్పొరేట్ సుడిగండాలు

కరోనా లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడింది. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు తట్టుకుని నిలబడ్డా.. చిన్నా చితకా స్కూళ్లన్నిటికీ తాళాలు పడ్డాయి. యాజమాన్యాలు మారిపోయాయి.  Advertisement ఇలా మారిపోయిన…

కరోనా లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడింది. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు తట్టుకుని నిలబడ్డా.. చిన్నా చితకా స్కూళ్లన్నిటికీ తాళాలు పడ్డాయి. యాజమాన్యాలు మారిపోయాయి. 

ఇలా మారిపోయిన యాజమాన్యాలు ఏదో ఒక రకంగా పిల్లల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. పాఠాలు చెప్పకపోయినా, పుస్తకాలు, మెయింటెనెన్స్ అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వీరికిప్పుడు అమ్మఒడి పథకం అనుకోని వరంలా మారింది.

అమ్మఒడి దరఖాస్తులన్నీ స్కూల్ ద్వారానే మండల స్థాయి అధికారులకు, అక్కడి నుంచి జిల్లా అధికారులకు చేరేలా ప్రస్తుతం సిస్టమ్ ఉంది. అంటే నేరుగా తల్లిదండ్రులెవరూ అమ్మఒడికి సొంతంగా దరఖాస్తులు పెట్టుకోలేరు. స్కూల్ యాజమాన్యం కనికరిస్తే వారి పేరు లిస్ట్ లో ఉంటుంది.

దీంతో పాత బకాయిలు కట్టండి, అమ్మఒడికి దరఖాస్తు చేసుకోండి అంటూ మెలికపెడుతున్నాయి స్కూల్ యాజమాన్యాలు. రెగ్యులర్ గా వచ్చే అమ్మఒడికి బ్రేక్ పడితే ఎక్కడ పథకం తమకు అందకుండా పోతుందోననే భయంతో.. అమ్మఒడికి వచ్చే డబ్బుల కంటే ఎక్కువగా స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నారు తల్లిదండ్రులు. అప్పులు చేసి మరీ ఫీజులు కడుతున్నారు.

అసలు అమ్మఒడికి దరఖాస్తులు తీసుకోకుండా ఉంటే.. తల్లిదండ్రులెవరూ ఈ ఏడాది పిల్లల్ని స్కూల్ కి పంపించేలా లేరు, వచ్చే ఏడాది నేరుగా పై తరగతుల్లో కూర్చోబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ అమ్మఒడి మధ్యలో రావడంతో.. అడ్మిషన్ల కోసం స్కూళ్లకు పరుగులు పెడుతున్నారు. యాజమాన్యాలు అడిగినంత ఫీజు కట్టడానికి సిద్దమయ్యారు.

దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ అమ్మఒడిని అడ్డు పెట్టుకుని ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దశలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అమ్మఒడి దరఖాస్తుల్ని సచివాలయాల్లో తీసుకునేలా నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. కార్పొరేట్ దాష్టీకాన్ని అడ్డుకోవాలంటున్నారు.

పిల్లల్ని బడికి పంపించే తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడిని అమలులోకి తెస్తే.. కార్పొరేట్లు దాన్ని ఇలా తమ సొంత లాభానికి వాడుకోవడం దారుణం. ఇకనైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలి. అమ్మఒడి కోసం అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలి. ఫీజులకు, అమ్మఒడి దరఖాస్తులకు సంబంధం లేకుండా చేయాలి.

అటూ ఇటూ ఎటూ కాలేక!