జీతాలు పెంచకుండా యూనిఫామ్ అంటగడతారా..?

సచివాలయ ఉద్యోగులది మరో గొడవ మొదలైంది. యూనిఫామ్ వేసుకోలేమంటున్నారు. పథకాలు రాని వారికి తాము టార్గెట్ గా మారతామని, యూనిఫామ్ వేసుకుంటే తమని టార్గెట్ చేస్తారని అంటున్నారు.  Advertisement ఇదేమంత పెద్ద లాజిక్ అనిపించకపోయినా…

సచివాలయ ఉద్యోగులది మరో గొడవ మొదలైంది. యూనిఫామ్ వేసుకోలేమంటున్నారు. పథకాలు రాని వారికి తాము టార్గెట్ గా మారతామని, యూనిఫామ్ వేసుకుంటే తమని టార్గెట్ చేస్తారని అంటున్నారు. 

ఇదేమంత పెద్ద లాజిక్ అనిపించకపోయినా మిగతా ప్రభుత్వ సిబ్బందికి లేని యూనిఫామ్ మాకెందుకని మాత్రం వారు లాజిక్ తో కొడుతున్నారు. చివరకు ఏమవుతుందో. సీఎం కూడా యూనిఫామ్ వేసుకోవాలంటారేమో..? అనే జోక్ లు పేలుతున్నాయి.

యూనిఫామ్ ఎందుకు..?

యూనిఫామ్ ఎందుకు వద్దు అనే ప్రశ్నలాగే.. యూనిఫామ్ అసలు ఎందుకు అనే మాటలు కూడా వినపడుతున్నాయి. సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటికే ఏఎన్ఎం కి వైట్ డ్రస్ ఉంది, కరెంటు డిపార్ట్ మెంట్ వారికి వేరే యూనిఫామ్ ఉంది. మహిళా పోలీసులకు ఇటీవల ఖాకీ యూనిఫామ్ ఇస్తున్నారు. వీరు కాకుండా మిగిలినవారందరికీ ఇటీవల యూనిఫామ్ క్లాత్ కూడా పంపిణీ చేశారు. 

స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అట్టహాసంగా పంచిపెట్టారు. కుట్టుకూలీ ఇస్తామని చెప్పి మరీ పంపించారు. జీతాలు పెంచాలని అడిగితే, ప్రొబేషన్ ని వెనక్కి నెట్టి.. ఇలా చేతిలో యూనిఫామ్ పెట్టారని గొణుక్కుంటూనే తీసుకెళ్లారు ఉద్యోగులు.

సచివాలయాలు ఓకే, అందులో సౌకర్యాలు ఓకే, మరి యూనిఫామ్ తో కొత్తగా ఒరిగేదేముందనేది ఉద్యోగుల ప్రశ్న, నిజంగానే యూనిఫామ్ తో ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది.. అనుకుంటే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి కూడా యూనిఫామ్ పెట్టండి అంటూ డిమాండ్ చేస్తున్నారు సచివాలయ స్టాఫ్.

మొత్తమ్మీద సచివాలయం స్టాఫ్ మాత్రం మాకీ యూనిఫామ్ వద్దంటున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఒత్తిడి తేగలదా..? బయోమెట్రిక్ హాజరు లేకపోతే జీతం కట్ చేస్తాం అనొచ్చు. యూనిఫామ్ వేసుకు రాకపోతే జీతం కోసేస్తామని చెబితే అది ప్రభుత్వానికే పరువు తక్కువ. దీనికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.