'అఖండ'తో డైరెక్టర్ బోయపాటి శ్రీను మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసినా… సినిమా, సినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకునే బోయపాటి శ్రీను, ఈసారి మాత్రం త్వరగా సినిమా అనౌన్స్ చేస్తున్నారు.
రామ్ హీరోగా సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారని గ్రేట్ ఆంధ్ర గతంలో వెల్లడించింది. ఈ రోజు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో సినిమాను శ్రీనివాసా చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ రామ్‌తో 'ది వారియర్' సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. రామ్‌తో ఆయన రెండో సినిమా ఇది. ఖర్చుకు వెనుకాడకుండా భారీ ఎత్తున సినిమా నిర్మిస్తామని ఆయన చెబుతున్నారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం… ఐదు భాషల్లో పాన్ ఇండియా ఫిలింగా బోయపాటి – రామ్ సినిమా రూపొందుతోంది. బోయపాటికి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఆయన సినిమాలు కొన్ని తమిళ్, హిందీలో రీమేక్ అయ్యాయి. ఈసారి అదర్ లాంగ్వెజెస్‌కు ఆయన వెళ్తున్నారు.
బోయపాటి శ్రీను సినిమాలకు హిందీలో విపరీతమైన డిమాండ్ ఉంది. రామ్ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే హిందీ ఆడియన్స్‌లో క్రేజ్ ఏర్పడుతుంది. మార్కెట్ పరంగానూ సినిమాకు ప్లస్ అవుతుంది.