‘కస్టడీ’లోకి సాయితేజ్ సినిమా.. రికార్డ్ కొడతాడా?

నిన్నగాక మొన్నొచ్చిన తమ్ముడు, మొదటి సినిమాతోనే వంద కోట్ల రికార్డ్ కొట్టేశాడు. చాన్నాళ్ల కిందటే కెరీర్ స్టార్ట్ చేసిన సాయితేజ్ మాత్రం ఇప్పటివరకు ఆ క్లబ్ లోకి ఎంటర్ అవ్వలేకపోయాడు. ఇన్నాళ్లకు విరూపాక్ష రూపంలో…

నిన్నగాక మొన్నొచ్చిన తమ్ముడు, మొదటి సినిమాతోనే వంద కోట్ల రికార్డ్ కొట్టేశాడు. చాన్నాళ్ల కిందటే కెరీర్ స్టార్ట్ చేసిన సాయితేజ్ మాత్రం ఇప్పటివరకు ఆ క్లబ్ లోకి ఎంటర్ అవ్వలేకపోయాడు. ఇన్నాళ్లకు విరూపాక్ష రూపంలో సాయిధరమ్ తేజ్ కు ఓ చక్కటి అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడా అవకాశానికి కస్టడీ రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురైంది.

విరూపాక్ష సినిమాకు మొదటి రోజు నుంచే ఊపొచ్చింది. ఆ తర్వాత వారం రిలీజైన సినిమాలు తేలిపోవడంతో ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. అలా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది ఈ మూవీ. మరో 9 కోట్ల కలెక్షన్ సాధిస్తే.. సగర్వంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరైపోవచ్చు.

కానీ ఈ వారాంతం కస్టడీ వస్తోంది. నాగచైతన్య నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ప్రమోషన్ గట్టిగా చేస్తున్నారు, ట్రయిలర్ కూడా క్లిక్ అవ్వడంతో అంచనాలు పెరిగాయి. సో.. ఈ వీకెండ్ విరూపాక్షకు గట్టి పోటీనివ్వబోతోంది కస్టడీ మూవీ.

ఇటు విరూపాక్షకు కూడా ఈ వారాంతం వసూళ్లే కీలకంగా మారాయి. 3వ వారం తర్వాత కూడా 9 కోట్ల కలెక్షన్ రావాలంటే శని, ఆదివారాలు సినిమా గట్టిగా ఆడాలి. హిందీ వెర్షన్ లో ఈ సినిమా క్లిక్ అవ్వలేదు కాబట్టి, ఇప్పుడు భారమంతా తెలుగు వెర్షన్ పైనే పడింది. 

కస్టడీని దాటి విరూపాక్ష వసూళ్లు సాధించగలిగితే.. తను కలలుకన్న వంద కోట్ల క్లబ్ లోకి సాయిధరమ్ తేజ్ ఎంటరైనట్టే.