ఫీల్ బాగుంది..ట్యూన్ మాత్రం

సీతమ్మ వాకిట్లో..శతమానం భవతి..ఇలాంటి సినిమాల్లో చూసిన ఉమ్మడి కుటుంబాలు, పెళ్లిళ్లు, పేరంటాలు..సందడులు..ఈ తరహా సినిమాటిక్ చిత్రీకరణతో మరో పాట వచ్చింది. ఈ నెల 18న విడుదలవుతున్న నందినిరెడ్డి ‘అన్నీ మంచి శకునమలే’ సినిమా నుంచి. …

సీతమ్మ వాకిట్లో..శతమానం భవతి..ఇలాంటి సినిమాల్లో చూసిన ఉమ్మడి కుటుంబాలు, పెళ్లిళ్లు, పేరంటాలు..సందడులు..ఈ తరహా సినిమాటిక్ చిత్రీకరణతో మరో పాట వచ్చింది. ఈ నెల 18న విడుదలవుతున్న నందినిరెడ్డి ‘అన్నీ మంచి శకునమలే’ సినిమా నుంచి. 

స్క్రీన్ మీద బోలెడు మంది నటీనటులు, మన వంటలు, మన పద్దతులు, మరిచిపోయిన, వదిలేసిన రోళ్లు, రోకళ్లు, దంపుళ్లు ఇవన్నీ మామూలే. అంతా మళ్లీ మరోసారి ఆ పాటల చిత్రీకరణను గుర్తుకు తెచ్చాయి.

కానీ ఒక్కటే తేడా. మాంచి క్యాచీ ట్యూన్ మాత్రం పడలేదు. మిక్కీ జే మేయర్ పాటల స్టయిల్ కు గీత దాటకుండా, అదే సౌండింగ్ తో పాట అయితే వచ్చింది. కానీ ట్యూన్ మాత్రం గతంలో ఆయన అందించిన అనేక హిట్ సాంగ్ ల మాదిరిగా లేదు. బహుశా చంద్రబోస్ ముందుగా పాట రాసి వుంటే మిక్కీ ట్యూన్ చేసారేమో? అందువల్లనే క్యాచీ ట్యూన్ అమరలేదేమో?

అయితే మిక్కీ చేసే పాటల సౌండింగ్ లోనే సేమ్ టు సేమ్ వుండడం వల్ల ఓ అడ్వాంటేజ్ వుంది. ఎక్కడో ఎప్పుడో విన్నాం అనే కన్నా, చాలా పరిచయం వున్న పాటలా అనిపిస్తుంది. బృంద మాస్టర్ నృత్యరీతులు అందించిన ఈ పాటలో సంతోష్ శోభన్-మాళవికతో పాటు డజన్ల కొద్దీ నటులు కనిపించారు.