డెల్టా, ఒమిక్రాన్ వచ్చాయి.. ఇప్పుడు డెల్టాక్రాన్ రెడీ?

కొత్త వంగడాలు సృష్టించి ఆహార ఉత్పత్తుల్ని పెంచడానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ.. కరోనా మాత్రం చాలా సింపుల్ గా కొత్త వేరియంట్లు పుట్టించి జనాలపై విరుచుకుపడుతోంది.  Advertisement ఒకదాన్ని మించి ఒకటి…

కొత్త వంగడాలు సృష్టించి ఆహార ఉత్పత్తుల్ని పెంచడానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ.. కరోనా మాత్రం చాలా సింపుల్ గా కొత్త వేరియంట్లు పుట్టించి జనాలపై విరుచుకుపడుతోంది. 

ఒకదాన్ని మించి ఒకటి కొత్త వేరియంట్ లు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల ఒమిక్రాన్ విషయంలో ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా.. దాన్ని మించి అన్నట్టుగా ఇప్పుడు డెల్టాక్రాన్ వచ్చేస్తోంది.

జోక్ కాదు.. సీరియస్..

డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ ను మిక్స్ చేసి దీనికి డెల్టాక్రాన్ అనే పేరు పెట్టారు. పెద్దగా ప్రభావం చూపని ఒమిక్రాన్ తర్వాత కొత్త వేరియంట్ వచ్చిందని ప్రచారం చేసినా ఎవరూ భయపడడం లేదు. కానీ ఇది మాత్రం సీరియస్. డెల్టాని మించే వేరియంట్ ఇప్పుడు విజృంభిస్తోంది. దాని పేరు డెల్టాక్రాన్. 

డెల్టా లోని తీవ్రత, ఒమిక్రాన్ లోని వ్యాప్తి.. ఆ రెండు లక్షణాలు కలిపి డెల్టాక్రాన్ లో ఉన్నాయట. యూకేలోని కొవిడ్ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా, ఈ డెల్టాక్రాన్ లక్షణాలు బయటపడ్డాయి. ఈమేరకు యూకేలోని హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. డెల్టాక్రాన్ ప్రమాదకారి అంటూ హెచ్చరించింది.

బాధితుల సంగతేంటి..?

వేరియంట్ ని గుర్తించారు సరే, కానీ బాధితుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ బారిన పడిన వ్యక్తుల్ని గుర్తించి, ఆ తర్వాత దాని ప్రభావాన్ని అంచనా చేస్తున్నామని హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు. ఈ వేరియంట్ తొలిసారిగా ఐరోపాలోని సైప్రస్ లో గుర్తించారట. 

కొంతమంది ఈ వేరియంట్ లేదని ప్రచారం చేస్తున్నా.. దీన్ని కనిపెట్టానని చెబుతున్న సైంటిస్ట్ మాత్రం డెల్టా, ఒమిక్రాన్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుందని, అందుకే డెల్టాక్రాన్ అనే పేరు పెట్టామంటున్నారు.

ఇది నిజంగా డెల్టా వేరియంట్ టైపులో ప్రపంచాన్ని వణికిస్తుందా లేక ఒమిక్రాన్ తరహాలో అంతగా ప్రభావం చూపించదా అనే విషయం రాబోయే రోజుల్లో జరగబోయే క్లినికల్ టెస్టుల్లో తేలిపోతుంది.