గంటా జోరుతో పెరిగిన వర్గపోరు

నాలుగేళ్లుగా విశాఖ తెలుగుదేశం పార్టీని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నడిపించారు. ఆయన నర్శీపట్నం నుంచి విశాఖ వచ్చి మీడియా మీటింగ్స్‌ పెట్టేవారు. అదే విధంగా కార్యక్రమాలలో పాలుపంచుకునేవారు.  Advertisement సరిగ్గా ఎన్నికల ఏడాదిలో…

నాలుగేళ్లుగా విశాఖ తెలుగుదేశం పార్టీని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నడిపించారు. ఆయన నర్శీపట్నం నుంచి విశాఖ వచ్చి మీడియా మీటింగ్స్‌ పెట్టేవారు. అదే విధంగా కార్యక్రమాలలో పాలుపంచుకునేవారు. 

సరిగ్గా ఎన్నికల ఏడాదిలో మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు యాక్టివ్‌ అయ్యారు. దాంతో ఆయన తెలుగుదేశంలో మళ్లీ తన పూర్వ పాత్రతో ముందుకు వచ్చారు. ఇది ఆయన ప్రత్యర్ది వర్గానికి ఇబ్బందిగా మారుతోంది. అంతే కాదు గంటా రూరల్‌ జిల్లాలోనూ వేలు పెడుతున్నారన్న ప్రచారం ఉంది. 

అనకాపల్లి ఎంపీ సీటు విషయమే కాకుండా నర్శీపట్నం రాజకీయాలలోనూ జోక్యం చేసుకుంటున్నారని అయ్యన్న అనుమానిస్తున్నారు. దాంతో ఆయన గంటా మీద గరం గరం అవుతున్నారు. ఇంకో వైపు పాయకరావుపేటలో మరోసారి పోటీ చేయాలని చూస్తున్న రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు కూడా అక్కడ గంటా వర్గం చుక్కలు చూపిస్తున్నారుట. 

పాయకరావుపేటలో కాపులు ఎక్కువ. దాంతో ఆ వర్గం అనితను గంటా సూచనల మేరకు వ్యతిరేకిస్తోందని టాక్‌. అనిత అయ్యన్న వర్గంలో ఉండడమే ఇందుకు కారణం అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే గంటా రాజకీయంగా చురుకు కావడం వైసీపీ కంటే టీడీపీకే ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు.