‘భయో’ డేటా: ‘తెల్గూ’కాంత్‌

నా పేరు: రజనీకాంత్‌ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘దేశ’ భక్తుడు (ఇన్నాళ్ళూ నేను బాబాలకు భక్తుడిననుకున్నారు. ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాల్లో నాకు తెలియకుండానే  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద భక్తి పొర్లుకుంటూ వచ్చేసింది.…

నా పేరు: రజనీకాంత్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘దేశ’ భక్తుడు (ఇన్నాళ్ళూ నేను బాబాలకు భక్తుడిననుకున్నారు. ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాల్లో నాకు తెలియకుండానే  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద భక్తి పొర్లుకుంటూ వచ్చేసింది. భాషా ఒక్క  సారి పొగడితే వంద సార్లు పొగడినటు.్ల అలాంటిది. వంద సార్లు పొగిడాను. ఇక చూసుకోండి.)

వయసు: ఏడుపదులు దాటాను అనకూడదు. ఏడు ‘పరుగులు’ దాటాను అనాలి. సెవెన్టీటూయే కానీ స్క్రీన్‌ మీద కొస్తే, సెవెన్‌టీన్‌ అయిపోతాను. 

ముద్దు పేర్లు: ‘తెలుగు’కాంత్‌ (అంటే తెలుగు చిత్రాల్లో నటించటం వల్లనో, నా సినిమాలో తెలుగులో  డబ్‌ కావటం వల్లనో కాదు. నేను నేరుగా ‘తెలుగు’దేశంలో భేదాలు వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంటాను. అప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రినుంచి తప్పిస్తున్నప్పుడూ వచ్చాను. ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ను పిలవని ఈ వేడుకలకూ వచ్చాను.)

విద్యార్హతలు: నేనే పాఠ్యాంశంగా మారాక కూడా, నే చదువుగురించి అడుగుతారా? సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌సి)లో ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టూ సూపర్‌ స్టార్‌’ అంటూ నా మీద పాఠం పెట్టారు. తెలుగు పుస్తకాల్లో కూడా పెట్టుకోవచ్చు ‘ఫ్రమ్‌ వైయస్‌రాయ్‌ టూ ఎన్టీఆర్‌ శతజయంతి’. 

విలాసం: ఏపీ వస్తే ‘కేరాఫ్‌ చంద్రబాబు నాయుడు’ 

గుర్తింపు చిహ్నాలు: ఒకటి: సినిమాల్లో హీరోని. రెండు: పాలిటిక్స్‌లో సైడ్‌ కిక్‌ని. 

వృత్తి: లకలకలకలక…! అది సినిమాల్లో… టపటపటప! ఇది పాలిటిక్స్‌లో (నాకు నచ్చిన నేత కనిపిస్తే నా చేతికి చిరతలు వాటంతట అవే వస్తాయి.)

మిత్రులు: ఫాన్స్‌ అనే మాట తప్ప నాకు రెండో మాట తెలియదు. 

శత్రువులు: ఒకర్ని పొగడితే, ఇంకొకరికి శత్రువునే కదా అయ్యేది.  

మిత్రశత్రువులు: ఉండరు. ఉంటే నచ్చరు. విలన్లు విలన్లలాగ కనిపిస్తేనే ఫైట్‌ చేస్తాను. 

జీవిత ధ్యేయం: ‘రజనీకాంత్‌ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా… ’ అనే ఈ డైలాగ్‌ ను పరమ స్టయిలిష్‌గా చెప్పాలని వుండేది. కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను పొగడటమే ఏకైక ధ్యేయంగా పెట్టుకున్నాను.

సర్‌