ఆగస్ట్… మెగాస్టార్..రజనీ పోటీ

ఆగస్ట్ 11. ఓ మాంచి డేట్ అని సినిమా జనాలు నమ్ముతున్నారు. అందుకే సినిమాల డేట్ లను ముందుగా ప్రకటిస్తున్నారు. మహేష్ బాబు సినిమా ప్రకటించారు కానీ సంక్రాంతికి వెళ్లింది. ఆ డేట్ కు…

ఆగస్ట్ 11. ఓ మాంచి డేట్ అని సినిమా జనాలు నమ్ముతున్నారు. అందుకే సినిమాల డేట్ లను ముందుగా ప్రకటిస్తున్నారు. మహేష్ బాబు సినిమా ప్రకటించారు కానీ సంక్రాంతికి వెళ్లింది. ఆ డేట్ కు మెగాస్టార్ భోళాశంకర్ వస్తోంది. అలాగే డిజె టిల్లు కూడా రావడానికి అవకాశం వుంది. 

ఇప్పుడు మరో సినిమా పోటీలోకి దిగింది. తెలుగునాట పెద్ద పోటీ కాకపోవచ్చు. కానీ రజనీ సినిమా అంటే చూసేవాళ్లు కొంతమంది అయినా వుంటారు. సినిమా హిట్ అయితే మాత్రం తెలుగు సినిమాలకు మించి కలెక్షన్లు ఇస్తారు మనవాళ్లు డబ్బింగ్ సినిమాలకు కూడా. ఎన్నో ఉదాహరణలు వున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే మాంచి బజ్ వున్న సినిమా..రజనీ కాంత్ జైలర్ ఆగస్టు 10న విడుదల చేస్తున్నారు. నీల్సన్ అందిస్తున్న ఈ సినిమాను సన్ టీవీ అందిస్తోంది. అందువల్ల కచ్చితంగా భారీ విడుదలే వుంటుంది. అంటే ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు వుంటాయన్న మాట ఆగస్ట్ రెండో వారంలో.

దీనికి తోడు డీజే టిల్లు 2 కూడా వుంటే భలే రంజుగా వుంటుంది. ఒకవేళ డిజె టిల్లు 2 వుంటే కనుక 12న వుంటుంది. అంటే 10,11,12 వరుసగా మూడు సినిమాలు అన్న మాట. సమ్మర్ లో సరైన సినిమా సరదా లేకుండా పోయింది కానీ ఆగస్ట్ లో మాత్రం రంజుగా వుంటుంది.