నేను అలాంటి మనిషిని కాదు – మాళవిక

చూడ్డానికే కాదు, మాటతీరులో కూడా స్పెషల్ గా ఉంటుంది మాళవిక నాయర్. చాలామంది హీరోయిన్లు హైదరాబాద్ కు వస్తే సొంతింటికి వచ్చిన ఫీలింగ్ వస్తుందని కబుర్లు చెబుతుంటారు. మాళవిక మాత్రం తనకు అలాంటి ఫీలింగ్స్…

చూడ్డానికే కాదు, మాటతీరులో కూడా స్పెషల్ గా ఉంటుంది మాళవిక నాయర్. చాలామంది హీరోయిన్లు హైదరాబాద్ కు వస్తే సొంతింటికి వచ్చిన ఫీలింగ్ వస్తుందని కబుర్లు చెబుతుంటారు. మాళవిక మాత్రం తనకు అలాంటి ఫీలింగ్స్ ఏం ఉండవంటోంది. ఎక్కడుంటే అక్కడి పరిస్థితులకు ఎడ్జెస్ట్ అయిపోతానని చెబుతోంది.

“సొంత ఊరు అనే ఫీలింగ్ నాకు లేదు, రాదు. కొచ్చిలో 2-3 ఏళ్లు ఉన్నప్పుడు మాత్రం కొంచెం అనిపించింది. అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎక్కువ టైమ్ ఉన్నది ఢిల్లీలోనే. అలా అని ఢిల్లీలో కూడా నాకు నోస్టాల్జిక్ ఫీలింగ్ రాదు. బహుశా నాకు అలాంటి ఫీలింగ్ లేదేమో. నేను అలాంటి మనిషిని కాదేమో.”

పరిసర ప్రాంతాలకు తొందరగా అలవాటు పడిపోతుందట మాళవిక నాయర్. హైదరాబాద్ లో ఉంటే పక్కా తెలుగు అమ్మాయిలా మారిపోతుందట. కొచ్చి వెళ్తే, అక్కడి ఫ్రెండ్స్ తో కలిసిపోతుందట, అంతే తప్ప, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఢిల్లీ మిస్సయ్యానని, అక్కడ ఉన్నప్పుడు కొచ్చి మిస్ అయ్యాననే ఫీలింగ్ తనకు రాదంటోంది.

ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. షూటింగ్ టైమ్ లో ట్రాలెలింగ్ అయితే ఇంకా ఇష్టం అంటోంది ఈ హీరోయిన్. ఎందుకంటే, ఓవైపు విహార యాత్రతో పాటు, మరోవైపు షూటింగ్ పని కూడా అయిపోతుందట. షూటింగ్ నిమిత్తం ఏదైనా దేశం వెళ్తే, ప్యాకప్ చెప్పడానికి ముందే, ఏఏ స్థలాలు చుట్టేయాలనే లిస్ట్ ను ముందురోజే సిద్ధం చేసుకుంటుందట మాళవిక.

ఆమె నటించిన 'అన్నీ మంచి శకునములే' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు బాగా ఎంజాయ్ చేశానని చెబుతోంది ఈ బ్యూటీ.