అక్కినేని హీరోలు.. వీళ్లకు కవరింగ్ చేతకాదు

హీరోలు కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా లేనప్పుడు మరోలా ఉంటారు. వాళ్ల వ్యవహారశైలి సంగతి పక్కనపెడితే, మాట తీరులో మాత్రం స్పష్టమైన తేడా ఉంటుంది. అయితే ఈ లెక్కల నుంచి అక్కినేని హీరోల్ని…

హీరోలు కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా లేనప్పుడు మరోలా ఉంటారు. వాళ్ల వ్యవహారశైలి సంగతి పక్కనపెడితే, మాట తీరులో మాత్రం స్పష్టమైన తేడా ఉంటుంది. అయితే ఈ లెక్కల నుంచి అక్కినేని హీరోల్ని తీసేయాలి. కవర్ చేయడం వీళ్లకు తెలియదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డమే తెలుసు. అదేంటని అడిగితే తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తారు ఈ హీరోలు.

మొన్నటికిమొన్న గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పరశురామ్ పై సంచలన ప్రకటనలు చేశాడు హీరో నాగచైతన్య. అతడి గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అంటూ చాలా పెద్ద కామెంట్ చేశాడు. సినిమా చేద్దామని చెప్పి, తన టైమ్ అంతా పరశురామ్ వేస్ట్ చేశాడని ఓపెన్ గా అనేశాడు చైతూ. నిజంగా అంత టైమ్ వేస్ట్ చేశాడా అని రిపోర్టర్ రెట్టించి అడిగితే అంతేగా..అంతేగా అంటూ కన్ ఫర్మ్ కూడా చేశాడు.

ఇలా ఓపెన్ మాట్లాడ్డం అక్కినేని హీరోలకే చెల్లింది. నిన్నటికినిన్న ఏజెంట్ సినిమా ప్రచారంలో భాగంగా అఖిల్ కూడా అంతే ఓపెన్ గా మాట్లాడాడు. కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానాలు చెప్పి, ఓపెన్ గా మాట్లాడితే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించాడు. కెరీర్ లో వచ్చిన ఫ్లాపుల్లో తనకు కూడా భాగం ఉందని ప్రకటించుకున్నాడు. జెన్యూన్ గా ఉంటే హాయిగా ఉంటుందని కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు.

కొడుకులే ఇలా ఉన్నారంటే తండ్రి సంగతి చెప్పనక్కర్లేదు. అసలు నాగార్జున మాటతీరులోనే ఓ నిజాయితీ కనిపిస్తుంది. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా నిజాయితీగా మాట్లాడ్డం నాగార్జున స్టయిల్. గతంలో ఓ సినిమా సక్సెస్ అయితే, ఆ సినిమా ఎలా హిట్టయిందో నాకే అర్థం కాలేదంటూ గట్టిగా నవ్వేశారు నాగ్. అదే టైమ్ లో ఫ్లాప్ అయితే అంతే ఓపెన్ గా రియాక్ట్ అయ్యారు కూడా.

గతంలో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో భాయ్ అనే సినిమా నాగ్. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ వెంటనే ఓ సందర్భంలో మీడియా ముందు ఓపెన్ గా వీరభద్రమ్ చౌదరిని తిట్టేశాడు నాగ్. అతడు చెప్పినట్టు చేయడమే తన తప్పని, సినిమా చెత్తగా తీశాడని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

అంతకంటే ముందు రగడ సినిమా టైమ్ లో కూడా ఇలానే స్పందించాడు నాగ్. అందులో రగడ..చెరుకుగడ అనే డైలాగ్ ఏదో ఉంది అందులో. తను చెప్పిన ఆ డైలాగ్ పై తానే సెటైర్ వేశాడు నాగ్. ప్రాస కోసం పిచ్చి డైలాగ్స్ రాస్తున్నారని అనేశాడు. అంతవరకు ఎందుకు, రీసెంట్ గా కూడా ఓ సందర్భంలో ఆఫీసర్ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ సినిమా ఫ్లాప్ కదా అని మీడియా జనం అడిగితే, “ఫ్లాప్ అంటారేంటి, డిజాస్టర్ కదా” అంటూ నవ్వేశారు నాగ్.

అలా నాగ్ వారసత్వంతో ఇండస్ట్రీకొచ్చిన చైతూ,అఖిల్ కూడా అంతే ఓపెన్ గా ఉంటున్నారు. తమకు కవర్ చేయడం రాదని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డమే వచ్చని మాటలతో నిరూపిస్తున్నారు.