ఈసారి ‘బండ్ల’ స్పీచ్ వుండదు!

ఈశ్వరా..పవనేశ్వరా అంటూ ఎలుగెత్తి మొదలెట్టి, గుక్క తిప్పుకోకుండా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు నిర్మాత బండ్ల గణేష్, వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ లో.  Advertisement కానీ ఈసారి భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్ లో…

ఈశ్వరా..పవనేశ్వరా అంటూ ఎలుగెత్తి మొదలెట్టి, గుక్క తిప్పుకోకుండా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు నిర్మాత బండ్ల గణేష్, వకీల్ సాబ్ సినిమా ఫంక్షన్ లో. 

కానీ ఈసారి భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్ లో బండ్ల స్పీచ్ వుండడానికి అవకాశాలు చాలా తక్కువ వున్నాయి. దీనికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ కు బండ్ల గణేష్ కు మధ్య దూరం పెరగడమే. 

అందువల్ల ఈ పంక్షన్ కు బండ్లను పిలుస్తారా? అన్నది అనుమానం. మరీ పట్టుపట్టి పవన్ కళ్యాణ్ పిలవమంటే తప్ప బండ్లకు ఈసారి స్పీచ్ అవకాశం వుండపోవచ్చు. కానీ బండ్ల స్థానంలో జబర్దస్త్ ఆదికి స్పీచ్ అవకాశం రాబోతోందని కూడా వినిపిస్తోంది. 

సినిమా ఫంక్షన్ లో బండ్ల స్పీచ్ అన్నది ఓ పేటెంట్. ఆయన భజన చేసినా, వాడే పదాలు, చెప్పే మాటలు వైరల్ అవుతాయి. జనాలకు భలే సరదాగా వుంటుంది. కానీ ఈసారి ఆ సరదాకు అవకాశం లేదనే చెప్పాలి.