మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ను ఆమెకు అన్న వరుసయ్యే భూమా కిషోర్‌రెడ్డి ఏకిపారేశారు. అఖిలప్రియతో విభేదించి భూమా కిషోర్‌రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్. ఇటీవల ఊరూరూ తిరుగుతూ రాజకీయంగా ఆయన బలపడుతున్నారనే వార్తలొస్తున్నాయి. వైసీపీకి ప్రత్యామ్నాయం భూమా కుటుంబంలో కిషోరే అనే టాక్ విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఈయన 2004లో మండలాధ్యక్షుడిగా పని చేశారు. ఈయన తండ్రి దివంగత భూమా భాస్కర్‌రెడ్డి. దివంగత భూమా నాగిరెడ్డికి స్వయాన అన్న. భూమా భాస్కర్‌రెడ్డి గతంలో ఆళ్లగడ్డ ఎంపీపీగా పని చేశారు. భూమా నాగిరెడ్డి దంపతుల ఆకస్మిక మృతి, ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఓటమి, అనంతరం ఆమె హైదరాబాద్‌కే పరిమిత మైన నేపథ్యంలో … భూమా అనుచరులకు అండగా నిలిచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టు ఆయన చెబుతారు.
ప్రస్తుతం ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ కాలువల క్లీనింగ్ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా గతంలో భూమా నాగిరెడ్డి తన ఎంపీ నిధులతో నిర్మించిన బస్సు షెల్టర్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై టీడీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి అఖిలప్రియ తీవ్ర వివాదం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకి అఖిలప్రియ సవాల్, అక్కడి నుంచి ప్రతిసవాల్ ఎదురయ్యాయి. దీంతో ఆళ్లగడ్డ రాజకీయం వేడెక్కింది. ఈ గొడవపై బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జ్ భూమా కిషోర్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ అఖిలప్రియపై నిప్పులు చెరిగారు. అఖిలతో పాటు ఆమె భర్తపై ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌లపై కిషోర్ ఎలా చెలరేగాలో ఆయన మాటల్లోనే…
“ఆళ్లగడ్డలో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ కాలువల శుభ్రత. అభివృద్ధికి అడ్డు పడకూడదనే ఉద్దేశంతో ఆళ్లగడ్డలో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలను స్వాగతించాం. వారం రోజులుగా ఆళ్లగడ్డ పరిణామాలు బాధించాయి. బస్సు షెల్టర్‌కు భూమా నాగిరెడ్డి ఫొటో వుండడం, దాన్ని చెప్పకుండా తొలగించడం వివాదానికి దారి తీసింది. ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి… మున్సిపల్ అధికారులు ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది. ఈ వివాదానికి కారణం మద్దూరి అఖిలప్రియనాయుడు. ఈమె అవకాశాల కోసం గుంటనక్కలా ఎదురు చూస్తూ వుంటుంది.
అఖిలప్రియ చేసే ప్రతి పని వెనుక క్రిమినల్ ఆలోచనలుంటాయి. ఇప్పుడిప్పుడే ఆళ్లగడ్డలో ప్యాక్షన్కు దూరంగా ఉంటున్నారు. గతంలో భూమా నాగిరెడ్డి శాంతియాత్ర చేశారు. అటు వైపు వాళ్లు (గంగుల) కూడా శాంతి మార్గంలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆళ్లగడ్డ అభివృద్ధికి నోచుకుంటూ, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ఈ సమయంలో మళ్లీ అఖిలప్రియ వచ్చింది. ఈమె ఏడాదిన్నర నుంచి కనిపించలేదు. హైదరాబాద్, కడప ప్రాంతాల్లో కిడ్నాప్‌లు, హత్యాయత్నాలు చేయడం అయిపోయాయి. కొత్తగా ఏం చేయాలి? తనను చూడగానే ప్రజలు భయపడాలని ఆలోచిస్తున్న ఆమెకి భార్గవ్‌రామ్ అనే భర్త తోడయ్యాడు. అతన్ని తీసుకొచ్చి ఆళ్లగడ్డ ప్రజలపై రుద్దింది. అఖిలప్రియ మంత్రి అయినప్పటి నుంచి భార్గవ్ చేయని అరాచకం లేదు.
అఖిలప్రియ టార్గెట్ అంతా ప్రజలు, అమాయకులు, భూమా కార్యకర్తలు. ఆమెకు ఓటుకు వేయకపోతే గొంతు కోసి చంపుతానంటాది. ఆ రకం ఆమెది. ఆమెను కాదని ముందుకు పోతే… వాళ్ల జీవితాలను ఎలా నాశనం చేద్దామా అని ఆలోచిస్తుంది. గత టీడీపీ హయాంలో భూమా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టింది అఖిలప్రియనే. ఈమె చిల్లర పనులకు, డబ్బు కోసం ..కాంట్రాక్ట్ ఉద్యోగా లను రెండుమూడు లక్షలకు అమ్ముకున్నది నిజం కాదా? ఇది భార్గవ్‌రామ్ చేతుల మీదుగా జరగలేదా? 40 ఏళ్లుగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్న సొంత వాళ్ల నుంచి కూడా పర్సంటేజీలు పీక్కుతినింది. ఆళ్లగడ్డలో ఎక్కడ రోడ్లు వేశారు? ఆళ్లగడ్డలో రోడ్లు వేసేందుకు రూ.50 కోట్లు మంజూరైతే ఒక్క రోడ్డు కూడా వేయలేదు.
కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఆళ్లగడ్డని నాశనం చేసింది. ఇంతకంటే ఎవరు నాశనం చేస్తారు? చివరికి అఖిలప్రియ ఎట్లా తయారైం దంటే… ఆళ్లగడ్డలో ఎవరైనా స్థలాలు అమ్ముకోవాలంటే ఆమెకి కమీషన్లు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. మొగుడుపెళ్లాలిద్దరూ ఆళ్లగడ్డ ప్రజల్ని బెదిరిస్తూ ఏం చేద్దామనుకుంటున్నారు. కొట్టాలి, బెదిరించాలని అనుకుంటే మీ తోలు తీస్తాం. భార్గవ్రామ్ది ఏ ఊరు? ఎవడతను? ఆళ్లగడ్డలో అతని పెత్తనం ఏంది? 40 ఏళ్లుగా కష్టపడుతున్నది భూమా కార్యకర్తలు. మధ్యలో ఇతనెవరు? ఈమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కరోజైనా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచావా? ఈ రోజు మహాతల్లి దిగొచ్చింది. నీ వల్ల ఎంతో మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక అల్లాడుతున్నారు. ఇలాంటి మహిళని టీడీపీ ఏ విధంగా వెనకేసుకొస్తోంది? హైదరాబాద్‌లో కిడ్నాప్‌లు, హత్యాయత్నాలు లాంటి నేరాలు చేస్తున్న మహిళని ఆళ్లగడ్డ ప్రజల మీద టీడీపీ ఏ విధంగా రుద్దాలని అనుకుంటోంది?
అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ లాంటి దరిద్రున్ని తీసుకొచ్చి ఆళ్లగడ్డకు అంటించొద్దు. భార్గవ్రామ్లాంటి క్రిమినల్స్‌ని పోలీస్‌శాఖ నియంత్రించాలి. కిడ్నాప్‌లు, హత్యాయత్నాల సంస్కృతిని ఆళ్లగడ్డకు తీసుకొస్తున్నారు. పోలీస్‌శాఖ ఇలాంటి వాళ్లని ఆపకపోతే రేపు ఆళ్లగడ్డలో ఏ ఒక్కరూ వ్యాపారం చేసుకోలేరు. అఖిలప్రియ డ్రామాలు నమ్మొద్దు. అఖిలప్రియా నువ్వు పోయి మద్దూరి కుటుంబంలో వుంటే ఏదైనా చేసుకో. ఇక్కడ నీ ఓవర్ యాక్షన్లు, దొంగ నాటకాలు కట్టిపెట్టు. నిన్ను ఆళ్లగడ్డ ప్రజలు నమ్మరు గాక నమ్మరు. ఇలాంటి వాళ్లని పక్కన పెట్టి టీడీపీ రాజకీయాలు చేసుకోవాలి” అని భూమా కిషోర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.