బామ్మ‌ర్ది పెళ్లికి భార్య హెచ్చ‌రిక‌… లీవ్ లెట‌ర్ వైర‌ల్‌

లోకంలో చిత్ర‌విచిత్ర‌మైన మ‌నుషులుంటారు. మ‌న‌కు తెలియ‌కుండా చాలా విచిత్రాలే జ‌రిగిపోతుంటాయి. బామ్మ‌ర్ది పెళ్లికి ఐదు రోజుల సెల‌వుల కోసం ఓ కానిస్టేబుల్ చేసిన ప‌నేంటో తెలిస్తే న‌వ్వాలో ఏడ్వాలో అర్థంకాదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో…

లోకంలో చిత్ర‌విచిత్ర‌మైన మ‌నుషులుంటారు. మ‌న‌కు తెలియ‌కుండా చాలా విచిత్రాలే జ‌రిగిపోతుంటాయి. బామ్మ‌ర్ది పెళ్లికి ఐదు రోజుల సెల‌వుల కోసం ఓ కానిస్టేబుల్ చేసిన ప‌నేంటో తెలిస్తే న‌వ్వాలో ఏడ్వాలో అర్థంకాదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ లీవ్ లెట‌ర్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌కు చెందిన దిలీప్‌కుమార్ అహిర్‌వార్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. కానిస్టేబుల్‌ రాసిన సెల‌వు చీటీ అత‌నికి చిక్కులు తీసుకొచ్చింది. ఈ నెల 7న ఆయ‌న డీఐజీకి ఓ లేఖ రాశాడు. 

త‌న బామ్మ‌ర్ది పెళ్లి ఉంద‌ని, ఈ నెల 11వ తేదీ నుంచి పెళ్లి కార్య‌క‌లాపాలు మొద‌ల‌వుతాయ‌ని, కావున ఐదు రోజుల పాటు సెల‌వు మంజూరు చేయాల‌ని విన్న‌వించాడు. ఇంత వ‌ర‌కూ ఓకే. అయితే లీవ్ లెట‌ర్‌లో మ‌రో వాక్యం కూడా క‌లిపాడు. అదే ఇప్పుడు ఉన్న‌తాధికారుల ఆగ్ర‌హానికి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.

‘నా తమ్ముడి పెళ్లికి రాకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి’ అని తన భార్య హెచ్చరించిందని, కావున కోరిన‌న్ని రోజులు సెలవులు మంజూరు చేసి భార్య ఆగ్రహం నుంచి కాపాడాలని డీఐజీని ఆయ‌న‌ వేడుకున్నాడు.  అంతేకాదు, ఇందులో భార్య హెచ్చ‌రించిన విష‌యాన్ని హైలెట్ చేశాడు. దీంతో స‌ద‌రు కానిస్టేబుల్‌పై పోలీస్ ఉన్న‌తాధికారులు సీరియ‌స్ అయ్యారు.

కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. కాగా కానిస్టేబుల్ సెల‌వుల విష‌య‌మై ఓ సీనియర్‌ పోలీసు అధికారి స్పందిస్తూ ….ఇలా ఏదో ఒక ప్ర‌త్యేక కార‌ణాలు చెప్పి అత‌ను కొన్ని నెల‌లుగా సెలవులు తీసుకుంటూనే ఉన్నాడ‌న్నారు. 

గ‌త‌ 11 నెలల్లో దాదాపు 55 సెలవులు తీసుకున్నాడ‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఏది ఏమైనా కానిస్టేబుల్ లేఖ మాత్రం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ స్కీమ్ సఫలం అయితే ఎపి దేశానికి రోల్ మోడల్ అవుతుంది