ఆంధ్రలో థియేటర్లు గేట్లు తెరిచేసాయి. నూరుశాతం ఆక్యుపెన్సీ మొదలుపెట్టేసాయి. బుధవారం నుంచి 100 శాతం టికెట్ లు అమ్మడానికి రంగం సిద్దం అయిపోయిది.
రాష్ట్ర ప్రభుత్వం 14 వరకు 50 శాతం నిబంధన విధించింది. ఆ తరువాత దాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించలేదు. అందువల్ల బై డీఫాల్ట్ గా ఆ నిబంధన కు కాలం చెల్లిపోయినట్లే అనే లీగల్ పాయింట్ ను ఆసరాగా తీసుకుని నూరుశాతం టికెట్ లు అమ్మకానికి పెట్టేసారు.
అందుకే భీమ్లా నాయక్ సినిమా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని 25 విడుదలకు రెడీ అయిపోయింది. నిన్న సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తుందేమో అని చూసారు. రాలేదు. కానీ ఈ పాయింట్ ను పట్టుకున్నారు. సడెన్ గా విడుదల ప్రకటించేసారు.
దీంతో వరుణ్ తేజ్ గని, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఇరుకునపడ్డాయి. భీమ్లా నాయక్ రాదనే ఆలోచనతో ఈ రెండూ డేట్ లు ప్రకటించాయి. ఇప్పుడు ఏం చేయాలో వాటికి అర్థం కావడం లేదు. గనికి వాయిదా తప్పదు. ఎందుకంటే మెగా హీరో కనుక. ఆడవాళ్లు సినిమా మాత్రం ధైర్యం చేస్తుందని టాక్ వినిపిస్తోంది.