బాలయ్య కోసం మీరా జాస్మిన్?

ఎప్పుడో నాలుగు నెలల తరువాత ప్రారంభం అవుతుంది అనిల్ రావిపూడి-బాలకృష్ణ కాంబినేషన్ సినిమా. కానీ దీనికి స్టార్ కాస్ట్ కోసం వేట మొదలయింది. సినిమాలో కీలకమైన పాత్ర ఒకటి వుంది. అదే బాలయ్య కుమార్తె…

ఎప్పుడో నాలుగు నెలల తరువాత ప్రారంభం అవుతుంది అనిల్ రావిపూడి-బాలకృష్ణ కాంబినేషన్ సినిమా. కానీ దీనికి స్టార్ కాస్ట్ కోసం వేట మొదలయింది. సినిమాలో కీలకమైన పాత్ర ఒకటి వుంది. అదే బాలయ్య కుమార్తె పాత్ర. 

కథ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్ర కోసం పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల ను తీసుకోవ‌లని డిసైడ్ అయ్యారు. అయితే ఈ పాత్ర కోసం ఆ అమ్మడు చాలా పెద్ద మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టిల సరసన రెండు పాత్రలు ఓకె చేసింది వీటి కోసం 72 లక్షల వంతున రెమ్యొనిరేషన్ ఫిక్స్ అయింది. 

ఇప్పుడు బాలయ్య సినిమాకు అంతకన్నా ఎక్కువ కావాలని హీరోయిన్ మదర్ డిమాండ్ చేస్తన్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాలో నటిస్తే ఆ క్రేజ్ వేరు అని, మంచి పాత్ర అని కాస్త తగ్గించుకోమని బేరసారాలు సాగిస్తున్నారు నిర్మాత, దర్శకులు.

అలాగే బాలయ్య సరసన నటించే హీరోయిన్ కోసం కూడా వెదుకులాట సాగుతోంది. ఈ మధ్యనే మేకోవర్ తో మాంచి గ్లామరస్ గా తయరైన సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ అయితే ఎలా వుంటుంది అన్న ఆలోచనలు సాగుతున్నాయి. 

మీరా జాస్మిన్ ఒకప్పుడు మాంచి క్రేజీ హీరోయిన్. కానీ తరువాత ఫిజిక్ పాడై తెరవెనక్కు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా కనిపిస్తోంది. అందుకే ఆమె పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.