ఉగ్రం…టికెట్ రేట్లు తక్కువ

నైజాంలో టికెట్ రేట్ల సమస్య ఇంకా వుంది. పెద్ద సినిమాలకు ఓకె కానీ చిన్న సినిమాలకు కూడా మల్టీ ఫ్లెక్స్ లకు అంతంత టికెట్ రేట్లు అంటే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు.  Advertisement…

నైజాంలో టికెట్ రేట్ల సమస్య ఇంకా వుంది. పెద్ద సినిమాలకు ఓకె కానీ చిన్న సినిమాలకు కూడా మల్టీ ఫ్లెక్స్ లకు అంతంత టికెట్ రేట్లు అంటే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. 

ఇది గమనించి కొన్ని సినిమాలకు నిర్మాతలే రేట్లు స్వచ్ఛందంగా తగ్గించుకుంటున్నారు. అలా తగ్గించపోతే వంద కోట్ల సినిమాకు 10 కోట్ల సినిమాకు ఒకటే రేటా అని జనం దూరం వుండే ప్రమాదం వుంది. ఈ వారం విడుదలవుతున్న నరేష్ ‘ఉగ్రం’ సినిమాకు నిర్మాతలు నైజాంలో టికెట్ రేట్లు తగ్గించుకున్నారు.

ముఖ్యంగా మల్టీ ఫ్లెక్స్ ల్లో టికెట్ రేట్లను 200 కే ఫిక్స్ చేసారు. సిటీ జనాలు ఎక్కువగా మల్టీ ఫ్లెక్స్ లకే వెళ్తున్నారు. అందుకే అక్కడ టికెట్ రేట్ ను 200కే ఫిక్స్ చేసారు. దీని వల్ల సినిమాకు మరీ ఓపెనింగ్ భారీగా పడకపోయినా, సినిమా బాగుంది అనే టాక్ వస్తే రన్నింగ్ బాగుంటుంది.

ఉగ్రం సినిమాను నైజాంలో నిర్మాతే ఓన్ గా పంపిణీ చేసుకుంటున్నారు. ఆంధ్ర, సీడెట్ మాత్రం బయ్యర్లకు విక్రయించారు. ఆంధ్ర రెండున్నర కోట్ల రేషియోలో నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ మీద విక్రయించారు. సీడెడ్ ను 54 లక్షలకు అదే పద్దతిలో విక్రయించారు. అందువల్ల టికెేట్ రేట్లు కాస్త రీజనబుల్ గా వుండేలా చూసుకున్నారు.

సినిమాకు దాదాపు 15 కోట్లు ఖర్చయింది, ప్రింట్ అండ్ పబ్లిసిటీతో కలిపి, థియేటర్ మీద నుంచి అయిదు కొట్లు రికవరీ కావాల్సి వుంది.