రేపు ఏ కాంబినేషన్ క్లిక్ అవుతుందో!

పేరుకు రెండూ మిడ్ రేంజ్ సినిమాలే. కానీ రెండింటికీ రెండు పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ రెండు సినిమాలు ఉగ్రం, రామబాణం. ఇక ఈ రెండు సినిమాలకు ఉన్న కామన్ సెంటిమెంట్ ఏంటో చూద్దాం..…

పేరుకు రెండూ మిడ్ రేంజ్ సినిమాలే. కానీ రెండింటికీ రెండు పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ రెండు సినిమాలు ఉగ్రం, రామబాణం. ఇక ఈ రెండు సినిమాలకు ఉన్న కామన్ సెంటిమెంట్ ఏంటో చూద్దాం..

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో తెరకెక్కింది ఉగ్రం సినిమా. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి నాంది లాంటి హిట్ సినిమా ఇచ్చారు. ఇప్పుడు సెకెండ్ హిట్ కోసం వెయిటింగ్. ఇలా హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ వస్తోంది ఉగ్రం.

అటు రామబాణం సినిమాది కూడా హిట్ కాంబినేషన్. గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి గతంలో 2 సినిమాలు చేశారు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా రామబాణం చేస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనేది వీళ్ల ప్రయత్నం.

ఇలా థియేటర్లలోకి ఒకే రోజు రెండు హిట్ కాంబినేషన్లు వస్తున్నాయి. వీటిలో ఏ కాంబో క్లిక్ అవుతుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. కామన్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ రెండు సినిమాలకు టికెట్ రేట్లలో కూడా అదే సారూప్యత కనిపిస్తోంది. ఉగ్రం సినిమాకు భారీగా టికెట్ రేట్లు తగ్గించారు.

తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 195 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు ఫిక్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలుగా టికెట్ ధరలు నిర్ణయించారు. ఉగ్రంతో పోలిస్తే రామబాణం సినిమాకు కాస్త ఎక్కువగా టికెట్ రేట్లు సెట్ చేశారు. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 200-250 రూపాయల మధ్య ఈ సినిమాకు టికెట్ రేట్లు లాక్ చేశారు.