ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రయ్ చేస్తున్నది థ్రిల్లర్ సినిమాలే. తక్కువ బడ్జెట్, చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా జనం చూడగలిగేది థ్రిల్లర్ సినిమాలే. అందుకే ప్రతి ఒక్కరు ఈ జోనర్ ట్రయ్ చేస్తున్నారు.
గతంలో పలు సినిమాల్లో నటించిన అరవింద్ కృష్ణ హీరోగా తయారైన థ్రిల్లర్ 'శుక్ర'. ఈ సినిమా టీజర్ ను బయటకు వదిలారు.
వాస్తవం, మిధ్య, భ్రమ, ఇలాంటి సైకలాజికల్ భావనల నడుమ జరిగే ఓ మిస్టరీ డ్రామాగా శుక్ర సినిమాకు స్క్రిప్ట్ తయారు చేసుకున్నట్లు టీజర్ చెబుతోంది. కాస్త లెంగ్తీగానే వున్న ఈ టీజర్ కాస్త ఆసక్తిరకంగా వుండేలాగే కట్ చేసారు.
సబ్జెక్ట్ కాస్తగా కొత్తగా ట్రయ్ చేసినట్లు తెలస్తోంది. కానీ కాస్టింగ్ మరీ కొత్త మొహాలు కావడం, చాలా బడ్జెట్ లో సినిమాను తీసినట్లు ట్రయిలర్ లోనే తేలిపోవడం అన్నది కాస్త మైనస్.
అరవింద్ కృష్ణ సరసన శ్రిజిత ఘోష్ నటించిన ఈ సినిమాకు ఆశీర్వాద్ సంగీతం, సుకు పురాజ్ కథ, మాటలు, దర్శకత్వం అందించారు.