మిసెస్ నిహా: పెళ్లితో ఒక్కటైన నిహారిక-చైతన్య

మెగా డాటర్ నిహారిక కొణెదల, ఇకపై శ్రీమతి నిహారిక. కొద్దిసేపటి కిందట చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఉదయ్ పూర్ లోని రిసార్ట్ లో నిహారిక పెళ్లి వేడుక అట్టహాసంగా…

మెగా డాటర్ నిహారిక కొణెదల, ఇకపై శ్రీమతి నిహారిక. కొద్దిసేపటి కిందట చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఉదయ్ పూర్ లోని రిసార్ట్ లో నిహారిక పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది.

నిన్న సాయంత్రం నుంచి పెళ్లి వేడుకలు ఊపందుకున్నాయి. మెహందీ ఫంక్షన్, సంగీత్ తో మెగా కుటుంబ సభ్యులంతా ఫుల్ హంగామా చేశారు. చిరంజీవి, చరణ్ డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈరోజు ఉదయం హల్దీ ఫంక్షన్, నిహాను పెళ్లికూతురుగా ముస్తాబు చేసిన కార్యక్రమాలు చకచకా జరిగాయి. ఇక్కడ కూడా హల్దీ ఫంక్షన్ కు చెందిన వీడియో వైరల్ అయింది. నిహారికను సాయితేజ్ ఆటపట్టించిన దృశ్యాలు అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి.

చైతన్యను పెళ్లిపీటలపై కూర్చోబెట్టి, అతడి కాళ్లు కడిగారు నాగబాబు. సరిగ్గా 7 గంటల 15 నిమిషాలకు తలపై జీలకర్ర-బెల్లం పెట్టడంతో నిహా-చైతన్యల వివాహం జరిగినట్టయింది. మెగా హీరోలతో పాటు.. రీతువర్మ, లావణ్య త్రిపాఠి ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. నిహారిక, రీతూ వర్మ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక లావణ్య త్రిపాఠి, నిహారికకు జిమ్ మేట్.

మరోవైపు మెగా హీరోల ఫ్యాన్స్ మాత్రం గ్రూపుల వారీగా తమ హీరోల ఫొటోల్ని క్రాప్ చేసి ట్రెండింగ్ చేసుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్, కేవలం అతడు మాత్రమే కనిపించే ఫొటోల్ని ట్రెండ్ చేస్తుంటే.. బన్నీ ఫ్యాన్స్ తమ హీరో కనిపించిన ఫొటోల్ని వైరల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి నిహారిక పెళ్లితో మెగా హీరోలంతా మరోసారి ఒకే వేదికపైకి వచ్చారు. 

Click Here For Photo Gallery

మ‌హేష్ తో ఒక్క‌డు కంటే గొప్ప సినిమా తీయాలి