‘మెగా’ కానుకల విలువ అయిదు కోట్లకు పైనే

మెగా డాటర్ నీహారిక వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ సందర్భంగా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి కోట్ల విలువైన నెక్లెస్ కానుకగా ఇచ్చారని కూడా వార్తలు వినిపించాయి. అవి ఎంత వరకు వాస్తవం అన్న…

మెగా డాటర్ నీహారిక వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ సందర్భంగా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి కోట్ల విలువైన నెక్లెస్ కానుకగా ఇచ్చారని కూడా వార్తలు వినిపించాయి. అవి ఎంత వరకు వాస్తవం అన్న సంగతి పక్కన పెడితే, మొత్తం మెగా ఫ్యామిలీల నుంచి నీహారికకు పెళ్లి సందర్భంగా వచ్చిన కానుకలు కచ్చితంగా అయిదు కోట్ల మేరకు వుంటాయని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవిది పెద్ద చెయ్యే. ఇంట్లో ఎవరి పెళ్లిళ్లు, పుట్టిన రోజులు జరిగినా ఏం కావాలో అడిగి మరీ బహుమతులు ఇవ్వడం అలవాటు వుంది. చాలాకాలం క్రితం తోడల్లుడు కూతురు పెళ్లికే లక్షల విలువైన బహుమతులు ఇచ్చారని టాక్. అలాంటిది స్వంత సోదరుని కుమార్తే, పైగా తన కుమార్తెలతో సమానంగా చూసుకునే నీహారిక పెళ్లి జరిగితే ఏ రేంజ్ లో బహుమతి ఇచ్చి వుంటారో ఊహించుకోవచ్చు.

ఇక రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్ కూడా విలువైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి జరిగింది తమ ఇంట్లోనే అయినా వరుణ్ తేజ్ కూడా ప్రెత్యేకంగా బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది, అలాగే సాయి ధరమ్ తేజ్, నీహారిక కు అప్పచెలెళ్ల వరుసయిన కజిన్స్ కూడా మంచి బహుమతులు అందించినట్లు వినిపిస్తోంది. మొత్తం మెగా బహుమతుల విలువ దాదాపు అయిదుకోట్లకు పైనే వుంటుందని తెలుస్తోంది.