స్క్రిప్ట్ లెవెల్ లో జడ్జ్ చేయలేకపోతున్నారు

చాలా మంది సినిమా జనాలు స్క్రిప్ట్ లెవెల్ లో సరైన అంచనా వేయలేకపోతున్నారని, సినిమా స్క్రీన్ మీదకు వచ్చాక, దాని లెవెల్ వారికి తెలుస్తోందని, దర్శకుడు వెంకట్ ప్రభు అన్నారు. కస్టడీ సినిమా విడుదల…

చాలా మంది సినిమా జనాలు స్క్రిప్ట్ లెవెల్ లో సరైన అంచనా వేయలేకపోతున్నారని, సినిమా స్క్రీన్ మీదకు వచ్చాక, దాని లెవెల్ వారికి తెలుస్తోందని, దర్శకుడు వెంకట్ ప్రభు అన్నారు. కస్టడీ సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో యూనిట్ మాట్లాడింది.

మానాడు సినిమా కథను తెలుగు హీరోలకు చెప్పారు కానీ వాళ్లు రిజెక్ట్ చేసారు, తమిళనాట పెద్ద హిట్ అయింది, అది ఇప్పుడు ఇక్కడ రీమేక్ అంటున్నారు, దీని మీద మీ స్పందన ఏమిటి అని వెంకట్ ప్రభును ప్రశ్నించగా వచ్చిన సమాధానం అది. మానాడు అనే కాదని, తన స్క్రిప్ట్ , కథ అన్నీ మేకింగ్ ప్రధానంగా వుంటాయని, అవి చాలా మంది ముందుగా ఊహించలేరని, స్క్రీన్ మీద చూసాక అప్పుడు తెలుస్తుందని అన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ దేనికైనా సక్సెస్ స్పీక్స్ కదా అని వెంకట్ ప్రభు చెప్పారు.

కథగా చెప్పాలంటే కస్టడీ చాలా చిన్న  పాయింట్ అని, సాధారణంగా విలన్ ను చంపాలని హీరో, హీరోను చంపాలని విలన్ అనుకోవడం కామన్ అని, కానీ ఈ సినిమాలో విలన్ చావ కూడదని హీరో అనుకుని, ఆ దిశగా వెళ్లడమే కొత్త పాయింట్ అని నాగ్ చైతన్య అన్నారు. విలన్ గా అరవింద్ స్వామి నటించారని, ఆయన పాత్రలో కేవలం విలనిజం మాత్రమే కాకుండా రకరకాల షేడ్స్ వుంటాయని, బ్రదర్ గా, ఫ్రెండ్ గా అనిపిస్తాడని కూడా చెప్పారు.

కస్టడీ సినిమా టేబుల్ ప్రాఫిట్ అని నిర్మాత చిట్టూరి శ్రీను ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 5న చెన్నయ్ లో కస్టడీ ట్రయిలర్ విడుదల ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తెలుగులో ఆ తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారు.