త్రివిక్రమ్ ఇది తప్పు కదా?

త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ డైరక్టర్ కానీ ఒకప్పుడు మాటల రచయిత, ఒక విధంగా ఘోస్ట్ డైరక్షన్ కూడా చేసి వుండొచ్చు. అప్పట్లో తనకు రావాల్సిన క్రెడిట్ ను ఎవరో కొట్టేస్తుంటే కాస్త బాధపడీ వుండొచ్చు.…

త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ డైరక్టర్ కానీ ఒకప్పుడు మాటల రచయిత, ఒక విధంగా ఘోస్ట్ డైరక్షన్ కూడా చేసి వుండొచ్చు. అప్పట్లో తనకు రావాల్సిన క్రెడిట్ ను ఎవరో కొట్టేస్తుంటే కాస్త బాధపడీ వుండొచ్చు. ఇప్పుడు మరి ఆయన అలాంటి పని చేయకూడదు. ఎవరికి దక్కాల్సిన క్రెడిట్ వాళ్లకు దక్కనివ్వాలి. కానీ అలా జ‌రుగుతున్నట్లు లేదు.

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ను సాగర్ దర్శకుడిగా ప్రారంభించారు. మాటలు త్రివిక్రమ్ అందించారు. స్క్రీన్ ప్లే కు సాయం అందించి వుండొచ్చు. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి సాగర్ మెలమెల్లగా మాయం కావడం మొదలయింది. ఇప్పుడు విడుదల దగ్గరకు వచ్చేసరికి సాగర్ పేరు వినిపించడం, ఎక్కడా కనిపించడం మానేసింది.

గతంలో తివిక్రమ్-పవన్ కలిసి చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర వికటించడంతోనూ, మహేష్ తో సినిమా కమిట్ మెంట్ వుండడతోనూ త్రివిక్రమ్ సాగర్ ను పేరు మేరకు పెట్టుకున్నారా? లేక సాగర్ కు సినిమా అప్పగించి, బాగా బజ్ రావడంతో తన ఫోల్డ్ లోకి తీసుకున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

లేటెస్ట్ గా ఊ అంటే త్రివిక్రమ్ భజ‌న చేసే ధమన్ ఓ ఫోటో వదిలారు భీమ్లా నాయక్ కోసం కైలాష్ ఖేర్ తో ఓ పాట పాడించారు. ఈ సందర్బంగా త్రివిక్రమ్. ధమన్, రామ్ జోగయ్య, కైలాష్ కలిసి దిగిన ఫొటో అది.

అంటే పాట ట్యూన్ కి, రికార్డింగ్ కు మరి దేనితోనూ సాగర్ కు సంబంధం లేదన్న మాట. మొత్తానికి భీమ్లా నాయక్ ప్రాజెక్టు మొత్తం త్రివిక్రమ్ ఖాతాల పడిపోయినట్లే అనుకోవాలి. అలా అంటే ఆయనే కదా పవన్ ఒప్పించారు. ఆయనే కదా స్క్రీన్ ప్లే, డైలాగులు అందించారు. 

ఆయనే కదా పాటల ట్యూన్ లు ఓకె చేసారు. ఆయనే కదా సెట్ కూడా వచ్చి ఘోస్ట్ డైరక్షన్ చేసారు అంటారేమో? అన్నీ బాగానే వుంది. మరి సాగర్ అనే పేరు ఎందుకు యాడ్ చేసినట్లు?