ఎమ్మెల్యేలకు అసలు పని లేదుట…?

ఎమ్మెల్యే అంటే ఎన్నో పనులు, ఫుల్ బిజీగా ఉంటారు. వారిని కలిసేందుకు ఎవరు ప్రయత్నించినా అయ్య గారికి అసలు ఖాళీ లేదు అన్న సమాధానం రొటీన్ గా వస్తుంది. నిజానికి ఎమ్మెల్యే అంటేనే ఒక దర్జా.…

ఎమ్మెల్యే అంటే ఎన్నో పనులు, ఫుల్ బిజీగా ఉంటారు. వారిని కలిసేందుకు ఎవరు ప్రయత్నించినా అయ్య గారికి అసలు ఖాళీ లేదు అన్న సమాధానం రొటీన్ గా వస్తుంది. నిజానికి ఎమ్మెల్యే అంటేనే ఒక దర్జా. ఒక బిగ్ పవర్. తన నియోజకవర్గానికి తానే రాజు, తానే మంత్రి.

తెల్లారి లేస్తే సమస్త భాధలతో కూడిన వినతిపత్రాలతో క్యూ కట్టే ఎక్కడెక్కడి జనాలు, సమస్యలు చెప్పుకుందామని పడిగాపులు పడే దీనార్తులు. ఇలా ఎపుడూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ జాతరనే తలపించాలి. కానీ ఏపీలో జగన్ ఏలుబడిలో ఎమ్మెల్యేలకు అలాంటి  సీన్ ఉందా. అటువంటి సనివేశం మొత్తం 175 నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయా అంటే లేదు అన్నదే నిజమైన మాట. మొహమాటానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు మేము బాగానే ఉన్నామని అనవచ్చు కానీ. వారిపుడు ఫుల్ ఖాళీ అంటే ఎవరైనా షాక్ తినాల్సిందే.

వైసీపీ సర్కార్ మూడేళ్లకు పాలన చేరువవుతున్న వేళ విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ తమ్ముడు, వైసీపీకి జై కొట్టిన సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే కుండబద్ధలు కొట్టారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలకు పని లేదన్నది పచ్చి నిజమని చెప్పేశారు. అంతేకాదు జీవీఎంసీలో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లకు కూడా తమ వార్డులో అసలు పని లేదని తేల్చేశారు.

ఆయన ఒక వైపు జగన్ సర్కార్ పని తీరుని పొగుడుతూనే ఈ కామెంట్స్ చేయడమే ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. జగన్ సంక్షేమానికి అభివృద్ధికి కూడా ప్రాధాన్యాత ఇస్తున్నారని కూడా వాసుపల్లి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 22 వేల కోట్ల రూపాయాలతో రోడ్ల అభివృద్ధి అనులు మొదలయ్యాయని కూడా చెప్పారు.ఇక విశాఖ అభివృద్ధి గురించి మాట్లాడుతూ అన్ని రకాలైన కార్యక్రమాలు తొందరలోనే జరుగుతాయని అన్నారు.

మొత్తానికి ఇన్ని మంచి విషయాలు ప్రభుత్వం గురించి చెప్పిన ఎమ్మెల్యే వాలంటీర్ల వల్ల తమకు ఎలాంటి పనీ లేదని నిజాయితీగా ఒప్పుకోవడం వైసీపీకి ప్లస్ గానా మైనస్ గా చేసినా కామెంటా అన్నదే చర్చట. అవును వాలంటీర్లే అన్ని పనులూ చూస్తున్నారు. జనాలకు వారి పేర్లే తెలుసు.

ఇది ఎన్నడూ ఎవరూ చూడని సరి కొత్త ప్రయోగం. వార్డు నుంచి మొదలుపెడితే నియోజకవర్గం దాకా అందరు ప్రజా ప్రతినిధుల కంటే కూడా వాలంటీర్లే జనాలకు దగ్గర అయ్యారు. వారే రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. సో వారే ఎపుడూ ఫుల్ బిజీ అన్న మాట. సో చూడబోతే ప్రజా ప్రతినిధుల కోణాన ఇదేదో కాస్తా ఆలోచించాల్సిన విషయమే కదా మరీ.