పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఫైనల్ షూట్ పార్ట్ జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణ సాగిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ వెనుక వేరే రీజన్ వుందని తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు చిత్రీకరిస్తున్న పాటను జస్ట్ టైటిల్స్, రోలింగ్ టైటిల్స్ మీద వేద్దాం అనుకున్నారని బోగట్టా. కానీ సినిమా కోసం ప్రిపేర్ చేసిన ఓ పాటను లేపేసారు.
రామజోగయ్య రాసి, చిత్ర ఆలపించిన అంత ఇష్టమేందయ్యా…అనే పాటను సినిమాలోంచి తీసేసారు. ఫ్లోలో సెట్ కావడం లేదనే ఆలోచనతో ఆ పాటను తీసేసినట్లు తెలుస్తోంది. దానికి బదులుగా వేరే చోట ఇప్పుడు చిత్రీకరిస్తున్న హీరో సెంట్రిక్ సాంగ్ వస్తుందన్నమాట.
అయ్యప్పన్ కోషియమ్ చిత్రం పక్కా క్లాస్ ఎమోషనల్ గా సాగితే, దాని రీమేక్ అయిన భీమ్లా నాయక్ పక్కా మాస్ ఎమోషనల్ గా తయారవుతోంది. పూర్తిగ పవన్ మాస్ ఇమేజ్ ను వాడుకుంటూ, మెయిన్ థ్రెడ్ అయిన ఎమోషన్ కు కూడా మాస్ టచ్ ఇచ్చేలా తయారుచేసారు.
అందువల్ల ఇది ఫ్యాన్స్ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. అలాంటి సినిమాలో ‘ఇంత ఇష్టమేందయ్యా’ అనే క్లాస్ సాంగ్ ఫిట్ కాదని యూనిట్ భావిస్తున్నట్లుంది. చిత్రమేమిటంటే ఈపాట తీసేస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మంచి నిర్ణయం అని ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు.