ది కేరళ స్టోరీ..తెలుగు నాట వుంటుందా?

కాశ్మీర్ ఫైల్స్ తరువాత దేశంలో వివాదాస్పద డిస్కషన్లకు తావిచ్చిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. ఇలాంటి అలాంటి వివాదం కాదు. కేరళ ను మాత్రమే కాదు, దేశాన్నే కుదిపే రేంజ్ లో వుంది వ్యవహారం. …

కాశ్మీర్ ఫైల్స్ తరువాత దేశంలో వివాదాస్పద డిస్కషన్లకు తావిచ్చిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. ఇలాంటి అలాంటి వివాదం కాదు. కేరళ ను మాత్రమే కాదు, దేశాన్నే కుదిపే రేంజ్ లో వుంది వ్యవహారం. 

సినిమాను ఆపాలని సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. సెన్సారు జరిగింది కనుక, అక్కడే తేల్చుకోమని సుప్రీం కోర్టు చెప్పేసింది. మరో పక్క ఈ సినిమాలో చెప్పిన విషయాలు నిజమని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా 5న విడుదలవుతోంది.

తమిళ, మలయాళ సినిమాలు తెలుగునాట విడుదల కావడం కొత్త కాదు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో అది తప్పదు కూడా. కానీ ఇక్కడ సమస్య హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ సిటీలో ఇలాంటి సినిమా విడుదలయితే స్పందన ఎలా వుంటుంది అన్నది. ప్రొటెస్ట్ లు లాంటివి తప్పకపోవచ్చు. పైగా రాబోతున్నది ఎన్నికల కాలం. మన రాజకీయ నాయకులు దేనినైనా ఎన్నికలకు ముడిపెట్టడంలో మాంచి హుషారుగా వుంటారు.

పైగా తెలంగాణలో భాజపా-భారాస ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక్కడ ఓట్ల కాలుక్యులేషన్లు వున్నాయి. పార్టీల మీద వాటి ప్రభావం వుంది. అందువల్ల వీటి అన్నింటి మధ్య ది కేరళ స్టోరీ నలిగిపోకుండా వుంటుందా..వెయిట్ అండ్ సీ.