కేసీఆర్ దూకుడు.. అసలు కారణం అదే?

సారు, కారు, కేసీఆరు.. ఇప్పుడు మన సారు దృష్టంతా సాగర్ పైనే ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎప్పుడనే విషయం పక్కనపెడితే.. ఎప్పుడు జరిగినా విజయం తమది కావాలనే కేసీఆర్ ఆశ పడుతున్నారు.…

సారు, కారు, కేసీఆరు.. ఇప్పుడు మన సారు దృష్టంతా సాగర్ పైనే ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎప్పుడనే విషయం పక్కనపెడితే.. ఎప్పుడు జరిగినా విజయం తమది కావాలనే కేసీఆర్ ఆశ పడుతున్నారు. అందుకే మరింత దూకుడు పెంచారు.

నా బంగారు పుట్టలో వేలు పెడితే.. నేను ఊరుకోనంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోనే తేల్చి చెప్పారు కేసీఆర్. మీరు హైదరాబాద్ జోలికొస్తే.. నేను ఢిల్లీ జోలికొస్తా.. ప్రతిపక్షాలను ఏకం చేస్తా, వాటికి నాయకత్వం వహిస్తా అంటూ సవాల్ విసిరారు. చివరకు అనుకున్నంతా అయింది.. బీజేపీ కేంద్ర నాయకత్వం భాగ్యనగరాన్ని టార్గెట్ చేసింది, కేసీఆర్ కి నిద్రలేకుండా చేసింది.

ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఊరుకుంటారు.. అన్నమాట ప్రకారం కేంద్రం పక్కలో బల్లెంలా మారడానికి సిద్ధమయ్యారు. భారత్ బంద్ ని అందుకు మహ బాగా ఉపయోగించుకున్నారు. ఏపీలో బంద్ కి వామపక్షాలు నేతృత్వం వహిస్తే.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బంద్ లో పాల్గొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విశేషం.

హైదరాబాద్ సహా.. జిల్లాల్లో జరిగిన ఆందోళనలకు టీఆర్ఎస్ నాయకులే నాయకత్వం వహించారు. బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక రకంగా బీజేపీతో ఘర్షణ వాతావరణాన్ని కోరుకున్న కేసీఆర్.. తాజా బంద్ తో దాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేసేలా కనిపిస్తున్నారు.

మరోవైపు దుబ్బాకలో ఓడిపోవడం.. గ్రేటర్ లో చావు తప్పి కన్ను లొట్టపోవడం.. కేసీఆర్ కి తల తీసేసినట్టు అనిపించాయి. ఫామ్ హౌస్ సీఎం, సెక్రటేరియట్ కు రానీ సీఎం.. అంటూ తనపై ఉన్న అపవాదుల్ని తొలగించుకునేందుకు తిరిగి యాక్టివ్ అవుతున్నారు కేసీఆర్. 

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వరుసగా మూడుసార్లు అధికారులతో వివిధ సమీక్షలు నిర్వహించారాయన. రాజకీయంగా తనకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే.. కొత్తగా తీసుకొచ్చిన ధరణి సేవల్ని కూడా ఉపసంహరించుకోవడానికి సీఎం రెడీ అవుతున్నారట.

ఇదంతా సాగర్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  జానారెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్తే.. సాగర్ లో ఆయన టీఆర్ఎస్ కి అతిపెద్ద ప్రత్యర్థిగా మారుతారు. 

కాంగ్రెస్ స్థానబలం, కేంద్రంలో బీజేపీ అధికార బలం.. రెండూ జానారెడ్డికి కలిసొస్తే నోముల నర్సింహయ్య అకాలమరణం కారణంగా వచ్చే సింపతీ ఓట్లు బీజేపీని ఎదుర్కోడానికి సరిపోవు. అందుకే ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు కేసీఆర్.

గ్రేటర్ ఫలితాల సాక్షిగా దూకుడు పెంచిన కేసీఆర్.. భారత్ బంద్ తో టీఆర్ఎస్ శ్రేణుల సత్తా చూపించారు. రాబోయే రోజుల్లో ఇదే దూకుడు చూపించి, బీజేపీని అడ్డుకుంటామని చెబుతున్నారు.

మళ్ళీ అదే ప్రశ్న