నిహారికకు ‘చిరు’ కానుక.. కళ్లు చెదిరే రేటు?

మెగా ఇంట నిహారిక పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. రేపు సాయంత్రం నిహారిక-చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఉదయ్ పూర్ లో అట్టహాసంగా జరగబోతోంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులంతా ఉదయ్ విలాస్ కు చేరుకున్నారు. పెళ్లి…

మెగా ఇంట నిహారిక పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. రేపు సాయంత్రం నిహారిక-చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఉదయ్ పూర్ లో అట్టహాసంగా జరగబోతోంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులంతా ఉదయ్ విలాస్ కు చేరుకున్నారు. పెళ్లి కానుకగా నిహారికకు మెగాస్టార్ ఓ 'చిరు' కానుక అందించారు.

పేరుకు ఇది 'చిరు' కానుకే అయినప్పటికే చాలా కాస్ట్ లీ. నిహారికకు అక్షరాలా 2 కోట్ల రూపాయల బహుమతిని చిరంజీవి దంపతులు కానుకగా అందించినట్టు తెలుస్తోంది. ఇంత డబ్బు పెట్టి నిహాకు చిరంజీవి ఏ గిఫ్ట్ అందించారో తెలుసా? 

తాజా సమాచారం ప్రకారం.. నిహారికకు డిజైనరీ బంగారు నగల సెట్ ను చిరంజీవి దంపతులు బహుమతిగా అందించారట. పెళ్లికి ఒక రోజు ముందే ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఆ ఖరీదైన బహుమతి నిహారికకు అందింది.

ఇక పెళ్లి వేడుక విషయానికొస్తే.. నిహారిక సంగీత్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. రామ్ చరణ్ తేజ్ తో కలిసి నిహారిక-చైతన్య కలిసి డాన్స్ చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, చరణ్, బన్నీకి చెందిన హిట్ సాంగ్స్ కు అంతా కలిసి చిందేశారు. బన్నీ, చరణ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, ఉపాసన తమ డ్రెస్సింగ్స్ తో ఆకట్టుకుంటున్నారు.

రేపు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు నిహారిక-చైతన్య పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఈ వీకెండ్ హైదరాబాద్ లో సినీ-రాజకీయ ప్రముఖులకు భారీ రిసెప్షన్ ఏర్పాటుచేసే ప్లాన్ లో ఉన్నారు.

Click Here For Photo Gallery

మళ్ళీ అదే ప్రశ్న