ఛత్రపతి ట్రయిలర్.. డ్యూటీ ఎక్కిన ప్రభాస్ ఫ్యాన్స్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలు కొన్ని హిందీలో బాగానే ఆడాయి. యూట్యూబ్ లో మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ హీరో ఇప్పుడు నేరుగా బాలీవుడ్ కు పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్ చేసిన…

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలు కొన్ని హిందీలో బాగానే ఆడాయి. యూట్యూబ్ లో మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ హీరో ఇప్పుడు నేరుగా బాలీవుడ్ కు పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్ చేసిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు.

ఛత్రపతి హిందీ ట్రయిలర్ రిలీజై కొన్ని గంటలు మాత్రమే అయింది. అంతలోనే ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దూకేశారు. ప్రభాస్ సినిమాను సెలక్ట్ చేసుకొని, బెల్లంకొండ తప్పు చేశాడనేది వీళ్ల వాదన.

ట్రయిలర్ లో ఎక్కడా ప్రభాస్ ను బెల్లంకొండ మ్యాచ్ లేకపోయాడంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ మేరకు ఒరిజినల్ ఛత్రపతిలోని స్టిల్స్, తాజాగా రిలీజైన హిందీ ఛత్రపతి ట్రయిలర్ లోని స్క్రీన్ షాట్స్ తో అప్పుడే పోలిక మొదలుపెట్టారు.

నిజానికి ఇలాంటి ప్రమాదం ఒకటి ఉంటుందని మేకర్స్ ముందుగానే ఊహించారు. అందుకే ఛత్రపతి సినిమాను హిందీ బెల్ట్ వరకు మాత్రమే పరిచయం చేశారు. టాలీవుడ్ కు దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ కంపారిజన్ మొదలైంది, బెల్లంకొండపై ట్రోలింగ్ షురూ అయింది.

ఇప్పుడే ఇలా ఉందంటే, సినిమా రిలీజైన తర్వాత హిందీ ఛత్రపతి సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చెడుగుడు ఆడుకునేలా ఉన్నారు. బాలీవుడ్ లో హిట్టయితే ఓకే, తేడా కొడితే మాత్రం ట్రోలింగ్ స్టఫ్ గా మిగిలిపోతుంది ఈ మూవీ. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది హిందీ ఛత్రపతి.