వెంకీ వాట్సాప్ లో ఉంటాడు.. మెసేజ్ పెట్టడు

దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఖుష్బూ. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆమెకు మంచి అనుబంధం ఉంది. అయితే అందరిలో వెంకటేష్ అంటే తనకు చాలా స్పెషల్ అని చెబుతోంది ఈ సీనియర్ నటి. వెంకీ తనకు…

దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఖుష్బూ. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆమెకు మంచి అనుబంధం ఉంది. అయితే అందరిలో వెంకటేష్ అంటే తనకు చాలా స్పెషల్ అని చెబుతోంది ఈ సీనియర్ నటి. వెంకీ తనకు సెంటిమెంట్ అంటోంది.

“వెంకటేష్ అంటే నాకు చాలా సెంటిమెంట్. నా ఫస్ట్ హీరో అతడు, అంతే కాదు, నా ఫస్ట్ ఫ్రెండ్ కూడా. నేను వెంకీ ప్రతి రోజూ మాట్లాడుకోం. కానీ నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే వెంకీ నాతో ఉంటాడు. సెంటిమెంటల్ అనే పదంలో వెంకటేష్ సెంటి పార్ట్ అయితే, నేను మెంటల్ పార్ట్. అంతలా కలిసిపోతాం.”

80ల నాటి హీరోహీరోయిన్లు 32 మంది ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారట. అందులో చిరంజీవి, రజనీకాంత్ నుంచి చాలామంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారట. పొద్దున్న లేస్తే ఏం చేశాం, ఏం తిన్నామనే చిన్న చిన్న విషయాల్ని కూడా అందులో షేర్ చేసుకుంటారట. ఆ గ్రూప్ లో వెంకీ ఉన్నాడు కానీ, పెద్దగా రెస్పాండ్ అవ్వడని కంప్లయింట్ చేస్తోంది ఖుష్బూ.

రామబాణం సినిమాలో కీలక పాత్ర పోషించింది ఖుష్బూ. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఆ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని చెబుతోంది. తను సినిమాల వెంట పడడం మానేశానని, మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నానని, ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది ఖుష్బూ.