కళా కవిత్వం అదిరింది?

కిమిడి కళా వెంకటరావు. చాన్నళ్ళ తరువాత నోరు విప్పారు. ఏడాదిన్నర క్రితం ఓడిన తరువాత మంత్రి పదవి పోయింది. రెండు నెలల క్రితం ఆరో వేలు లాంటి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా…

కిమిడి కళా వెంకటరావు. చాన్నళ్ళ తరువాత నోరు విప్పారు. ఏడాదిన్నర క్రితం ఓడిన తరువాత మంత్రి పదవి పోయింది. రెండు నెలల క్రితం ఆరో వేలు లాంటి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా పోయింది.

ఆ తరువాత నుంచి సడీ సందడి లేకుండా గడుపుతున్న కళా తాజాగా మీడియా ముందుకు వచ్చారు. మంచి రైమింగ్ తో జగన్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేసి తాను మళ్ళీ పొలిటికల్ గా డైనమిక్ గా ఉన్నాను అనిపించుకున్నారు.

ఇక కళా నోటి వెంట కవిత్వం అలా పారింది. అదేంటి  అంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఆటవిక పాలన. మంచి రైమింగ్. వింత రాజ్యంలో విచిత్రమైన జబ్బులట. ఇక్కడ కూడా రైమింగ్ సరిపోయింది. జగన్ పాలన మీద కళా కవిత్వమిది.

రాజ్యాంగ వ్యవస్థలను జగన్ సర్వనాశనం చేస్తున్నాడు అంటూ చంద్రబాబు పాడిన పాటనే ఆ తరువాత అందుకున్నారు. ఇక ఈ నెలలో జగన్ పెద్ద ఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణీ చేస్తున్న నేపధ్యంలో అది కూడా తమ క్రెడితే అంటూ కళా చెప్పడమే అసలైన ట్విస్ట్. 

మొత్తనికి వింత జబ్బులు ఏమో కానీ ఏపీ రాజకీయాలు మాత్రం చిత్ర విచిత్రంగా ఉన్నాయని టీడీపీ పెద్దల విమర్శలను బట్టి అర్ధమవుతోందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు అంటే ఆలోచించాల్సిందే కదా.

పవర్ స్టార్ పేరెత్తగానే