గత ప్రభుత్వ హయాంలో న్యాయమూర్తులు అమరావతిలో నామమాత్రపు రేట్లకు భూములు తీసుకోవడం పై ఏపీ హై కోర్టును ఆశ్రయించారు ఒక లాయర్. న్యాయమూర్తులు అలా భూములు తీసుకోవచ్చా? .
వారే అమరావతిలో భూములు తీసుకోవడంతో.. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై నిస్పాక్షికమైన విచారణ జరుగుతుందా? అనే ప్రశ్నలను హై కోర్టు ముందుంచారు ఆ లాయర్. సీఆర్డీయే చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై హై కోర్టులు జరుగుతున్న విచారణ నేపథ్యంలో.. తను లేవనెత్తిన అంశాలపై విచారణ జరగాలని సింహంభట్ల శరత్‌కుమార్ అనే న్యాయవాది హైకోర్టును కోరారు.
అయితే ఈ అంశంపై స్పందించిందిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యానికి, తమ ముందున్న రాజధానుల కేసుకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వేరే అంశమని పేర్కొంది.
పలుమార్లు తన కేసును ప్రస్తావించినప్పటికీ, వాదనలు వినిపించేందుకు తనకు ఇప్పటివరకు అవకాశం రాలేదని ఆ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ధర్మాసనం ఈ వ్యాజ్యానికీ, తమ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదని వ్యాఖ్యానించింది.
అలాగే తన వ్యాజ్యంపై విచారణకు స్పష్టమైన తేదీని కేటాయించాలని ఆ లాయర్ కోరినా అందుకు అవకాశం లభించలేదు.