పలు షార్ట్ ఫిలిమ్ లు తీసి, ఇప్పుడు డైరక్టర్ గా పరిచయం అవుతున్నాడు సతీష్ మాలెంపాటి. ఆయన దర్శకత్వంలో తెలుగు,కన్నడ,తమిళ భాషలలో తెరకెక్కుతోన్నచిత్రం 'సమిధ`. కన్నడ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో `ఉండిపోరాదే` మూవీ ఫేమ్ అనువర్ణ, తమిళ నటి ఛాందిని హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అరుణం ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. . ముహూర్తపు సన్నివేశానికి ఆశీష్ క్లాప్ కొట్టగా రాజేంద్రప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. డిసెంబర్ 8 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2021 సమ్మర్ స్పెషల్‌గా విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈసందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ మాలెంపాటి మాట్లాడుతూ – రాజస్థాన్‌లో జరిగిన ఒక యదార్ధ గాథని ఇన్స్పిరేషన్గా తీసుకుని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నాను. రెండు గంటల పాటు ట్విస్ట్‌లు, టర్న్లతోపాటు చేజింగులు, యాక్షన్ సీన్స్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది.
కచ్చితంగా ఆడియన్స్‌కి ఒక ఫర్ఫెక్ట్ థ్రిల్లర్ చూసిన అనుభూతినిస్తుంది. మూడు భాషల్లో షూట్ చేస్తున్నాం. ఒక భాషలో డబ్బింగ్ చేస్తున్నాం. హైదరాబాద్, చైన్నె, బెంగుళూరులో షూటింగ్ జరపనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2021 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
హీరో అక్షిత్ శశికుమార్ మాట్లాడుతూ – “తెలుగులో `సమిధ` నా రెండవ చిత్రం. ఈ సినిమా ఒక థ్రిల్లర్ కథాంశం అయినా ఇన్‌బిల్ట్ ఒక ఆహ్లాదకరమైన ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా నాకు హీరోగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
హీరోయిన్ అనువర్ణ మాట్లాడుతూ – 'ఉండిపోరాదే` హీరోయిన్ గా నా మొదటి చిత్రం. ఆ తర్వాత నేను నటించిన రెండు చిత్రాలు విడుదలకి సిద్దంగా ఉన్నాయి. సమిధ హీరోయిన్గా నా నాలుగవ చిత్రం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అన్నారు.