ఆ సినిమాకు ఫైనాన్షియల్ ఎఫెక్ట్?

ఓ పెద్ద డైరక్టర్ పలు ఫ్లాపుల తరువాత తీసిన ఓ సినిమా అనుకోకుండా పెద్ద హిట్ అయింది. దాంతో ఇంకా పెద్ద హిట్ చేయాలని, పెద్ద సినిమా చేయాలని, ఏకంగా పాన్ ఇండియా సినిమా…

ఓ పెద్ద డైరక్టర్ పలు ఫ్లాపుల తరువాత తీసిన ఓ సినిమా అనుకోకుండా పెద్ద హిట్ అయింది. దాంతో ఇంకా పెద్ద హిట్ చేయాలని, పెద్ద సినిమా చేయాలని, ఏకంగా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసారు. కానీ కరోనా వచ్చి మొత్తం ప్లాన్ పాడు చేసినట్లు కనిపిస్తోంది. సమస్య యూనిట్ ది కాదు. ఫైనాన్స్ తో. కరోనా కారణంగా ఇండస్ట్రీలో టర్నోవర్ మొత్తం ఆగిపోయింది.

థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, వాళ్ల నుంచి ప్రొడ్యూసర్లకు, అక్కడి నుంచి ఫైనాన్షియర్లకు ఇలా రోటేషన్ వుండేది. కానీ ఇప్పుడు అదంతా ఆగిపోయింది. దాంతో ఈ సినిమాకు అందాల్సిన ఫైనాన్స్ అందడం లేదని తెలుస్తోంది. దాంతో సినిమా ముందుకు కదలడం లేదు. 

డిసెంబర్ లో షూట్ అన్న టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ఆ సూచనలు కనిపించడం లేదు.పైగా సినిమా విదేశాల్లో ఎక్కువ భాగం షూట్ చేయాల్సి వుంది. ఖర్చు కూడా ఎక్కువ. అందువల్ల ఇప్పట్లో సెట్ మీదకు వెళ్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

జనవరి నుంచి వెళ్తే వెళ్లినట్లు లేదంటే మార్చి తరువాతే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలోగా వేరే సినిమా చేయాలనే ఆలోచనలో ఆ సినిమా హీరో వున్నట్లు కూడా గ్యాసిప్ వినిపిస్తోంది.

కెసిఆర్ పై ఆర్కే కొత్త పలుకు