నంది అవార్డుల వ్యవహారం పోసాని, అశ్వినీదత్ మధ్య రాజకీయంగా చిచ్చు రేపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిర్మాత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పోసాని కృష్ణమురళి. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అవార్డులు మీ వాళ్లకే ఇవ్వాలంటూ విమర్శించారు. పదే పదే సీఎం జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు.
అలాగే రజనీకాంత్ గురించి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడుని పొగిడేందుకు రజనీకాంత్ రోజూ విజయవాడకు వచ్చిన ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. రజనీ తమిళ సూపర్ స్టార్ అని.. చిరంజీవి తెలుగు వారికి సూపర్ స్టార్ అని.. మేము చిరంజీవిని అభిమానిస్తామని.. చిరంజీవి వైఎస్ జగన్ గారిని ఇష్టపడతారన్నారు.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల వేడుకలు ఘనంగా జరిగేవి. ప్రతి ఏటా సినీ రంగంలోని 24 రంగాలల్లో ప్రతిభ కనబర్చిన వారికి నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. అయితే రాష్ట్ర విడిపోయాక నంది అవార్డులను ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇరు రాష్ట్రాలు నంది అవార్డులను ఇవ్వడం నిలిపేశాయి.
పోసాని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉండగా, అశ్వినిదత్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఏ సమస్యపై మాట్లాడని అశ్వినీదత్ అప్పుడప్పుడు జగన్ సర్కార్ పై తన అక్కసు వెళ్లగక్కడం పరిపాటిగా మారుతోంది.