దర్శకుడు సురేందర్ రెడ్డి. ఏజెంట్ ఫెయిల్యూర్ తో తన కెరీర్ ను మళ్లీ ఎల్కేజీ నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సురేందర్ కు ఎవరు అవకాశం ఇస్తారు అన్నది అది ప్రశ్న.
సురేందర్ తన తరువాత సినిమాను టాగోర్ మధుకు చేయాల్సి వుంది. నితిన్ హీరోగా అని గతంలో అనుకున్నారు. కానీ ఇప్పుడు అటు టాగోర్ మధు కానీ ఇటు నితిన్ కానీ ఒకటే విషయంలో ఫిక్స్ డ్ గా వున్నారు. సరైన కథ, స్క్రిప్ట్ వుంటేనే ముందుకు వెళ్దాం అన్నదే పాయింట్. అన్ని విధాలా సాయం చేద్దాం కానీ సినిమా అంటే మాత్రం సరైన కథ దొరికితేనే అన్నది ఫిక్స్ అయి వున్నారు.
ఏజెంట్ విడుదలయిన నాడు మార్నింగ్ షో తో నో సురేందర్ రెడ్డి కి సినిమా ఫలితం పక్కాగా అర్థం అయిపోయింది. తొలి మూడు రోజులు రెస్ట్ తీసుకుని, సోమవారం నుంచి కొత్త కథ మీద కసరత్తు మొదలుపెట్టేసారు. ఈ కసరత్తు చేసే కథ పాయింట్ ఇప్పటికే అల్లు అర్జున్ ఓకె చేసి పెట్టిందే. ఇప్పుడు అది కనుక సరైన స్క్రిప్ట్ గా మారితే సినిమా చేయడానికి బన్నీ రెడీగా వున్నారని తెలుస్తోంది.
బన్నీ కథల వ్యవహారాలు చూసే సాయి ఈ మేరకు సురేందర్ తో బాగా టచ్ లో వున్నారని బోగట్టా. బన్నీ ఒకేసారి ఒకటి రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేసే పనిలో వున్నారని తెలుస్తోంది. వాటిలో ఒకటి త్రివిక్రమ్ సినిమా. దీనికి కథ ఎప్పుడో ఓకె అయిపోయింది. మరో సినిమా సురేందర్ రెడ్డిది కావచ్చు అని తెలుస్తోంది.
సురేందర్ రెడ్డి చెప్పిన ఓ పాయింట్ కు బన్నీ ఓకె చెప్పారని తెలుస్తోంది. దీన్ని కనుక సరైన, అద్భుతమైన స్క్రిప్ట్ గా తయారుచేస్తే సురేందర్ కు ఓ అద్భుతమైన చాన్స్ చేతిలో పడుతుంది. లేదంటే కష్టమే.