నాదెండ్ల పెద్ద ఆశలు…పెద్ద మాటలు..

నాదెండ్ల మనోహర్ అన్న ఆయన మాజీ మంత్రి నాదెండ్ల భాస్కర రావు తనయుడుగా కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ గా కొంత మందికి కొంత పరిచయం. ఆయన మెయిన్…

నాదెండ్ల మనోహర్ అన్న ఆయన మాజీ మంత్రి నాదెండ్ల భాస్కర రావు తనయుడుగా కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ గా కొంత మందికి కొంత పరిచయం. ఆయన మెయిన్ స్ట్రీమ్ లో వెలిగిన నాయకుడు కాడు. సముద్రంలో ఉప్పుకు చెట్టు మీద కాయకు కలసినట్లుగా జనసేన అధినేత కం సినీ హీరో పవన్ తో ఆయనకు జోడీ కుదిరింది.

జనసేనలో లీడర్లు ఎవరూ లేకపోవడం ఆయనకు కలసివచ్చింది. జనసేనకు ఎటూ పవన్ సినీ గ్లామర్ ఉంది. ఒక బలమైన సామాజిక అండ ఉందన్న ప్రచారమూ ఉంది. దాంతో డిప్యూటీ లీడర్ గా నాదెండ్ల మనోహర్ హవా ఆ పార్టీలో సాగుతోంది. ఆయన విశాఖ విడిది చేసి గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు.

మీడియాతో ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే విశాఖ భూ దందాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని భారీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశారు. అంతే కాదు వైసీపీ విశాఖలో తలపెట్టిన అక్రమ నిర్మాణాలను గురించి కూడా పరిశీలించి సమీక్షిస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ భూ దందాల మీద విచారణ జరిపిస్తామని చెబుతున్నారు.

దీన్ని బట్టి చూస్తూంటే ఏపీలో రేపటి రోజున జనసేన అధికారంలోకి కచ్చితంగా వచ్చేసినట్లుగానే నాదెండ్ల భావిస్తున్నారా అన్న కామెంట్స్ వస్తున్నాయి టీడీపీతో పొత్తు ఉంటే జనసేన గెలిచి రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఈ మాటలు ప్రకటనలు అన్నీ టీడీపీ ప్రభుత్వంలో సాగుతాయో వీగిపోతాయో కూడా ఎవరికీ తెలియదు అని అంటున్నారు.

నాదెండ్ల విశాఖ భూముల కబ్జా అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా విశాఖలో భూములను టీడీపీ తమ్ముళ్లే చుట్టేశారన్న ఆరోపణల మీద ని సిట్ ని ఒకదాన్ని చంద్రబాబు నాడు ముఖ్యమంత్రిగా వేశారు. ఆ సిట్ సంగతి అప్పటి భూ కబ్జాల సంగతి కూడా వెలికి తీస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. భూ కబ్జాలు విశాఖలో వెల్లువలా జరిగినది టీడీపీ హయాంలోనే అన్నది లోకల్ గా ఉండే వారే చెబుతారు. అవన్నీ మరచిపోయి తన నాయకుడి మాదిరిగానే తాను కూడా వైసీపీ వ్యతిరేకతనే అజెండాగా చేసుకుని వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్లుగా  నాదెండ్ల  ఢంకా భజాయించడం మీదనే కామెంట్స్ పడుతున్నాయి.