నిర్మాత అశ్వనీదత్ ఆవేశం ఆపుకోలేరు. అందుకే ఆయనను వీలయినంత వరకు ఎక్కువ మాట్లాడకుండా చూస్తారు పిల్లలు స్వప్న, ప్రియాంక. కానీ ఎంత జాగ్రత్తగా వున్నా ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. కాంట్రావర్సీ చేస్తూనే వుంటారు.
అన్నీ మంచి శకునములే అన్న చిన్న సినిమా తీసి విడుదలకు రెడీ చేస్తున్న టైమ్ లో అశ్వనీదత్ ఇలాంటి కామెంట్ లు చేసారు. అదృష్టం కొద్దీ ఇది చిన్న సినిమా కాబట్టి సరిపోయింది. లేదూ కాస్త పెద్ద సినిమా అయి వుంటే ఆంధ్రలో ఇబ్బందులు తలెత్తేవి.
ప్రాజెక్ట్ కె లాంటి సినిమా అనుకోండి. అదనపు ఆటలు, బెనిషిట్ షో లు, అదనపు రేట్లు అమ్మేసే అవకాశం వుంటుంది. అప్పుడు ప్రభుత్వం కట్టడి చేసే అవకాశం వుంది. కానీ అన్నీ మంచి శకునములే. అసలు సినిమాకు ఇప్పటికే సరైన బజ్ లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ హీరో ఇప్పటికే ఫ్లాపుల హీరోగా ముద్రపడిపోయాడు. నందినీ రెడ్డి దర్శకురాలు. అయినా కూడా సినిమాకు మినిమమ్ బజ్ లేదు. ఓపెనింగ్ పడే అవకాశం కనిపించడం లేదు. విడుదలైన తరువాత మంచి టాక్ వస్తే అప్పుడు వేరే సంగతి.
ఈ సినిమాకు ప్రభుత్వం నుంచి ఏ సమస్య లేదన్న ధీమా అశ్వనీదత్ చేత అలా మాట్లాడించి వుండొచ్చు. ప్రాజెక్ట్ కె కు కూడా పెద్దగా సమస్య వుండదు. ఎందుకంటే ప్రభాస్ అన్నా, ఆయన సన్నిహితుడు యువి వంశీ అన్నా జగన్ ప్రభుత్వం దగ్గర ఫుల్ పాజిటివ్ నే వుంది. అందువల్ల ఆ సినిమాకు కూడా సమస్య ఏమీ వుండదు.
కానీ ఈ సినిమా అయినా, ఆ సినిమా అయినా కాస్త తేడా వస్తే, అప్పుడు వుంటుంది వైకాపా సోషల్ మీడియా పదును ఎలా వుంటుందో. అప్పుడు తెలుస్తుంది అశ్వనీదత్ ఇప్పుడు చేసిన కామెంట్ ల ప్రభావం ఏమిటో?