హీరోయిన్ తో లిప్ కిస్ పై రవితేజ రియాక్షన్ ఇది

కొంతమందికి లిప్ కిస్సులు కామన్. అలాంటి సీన్లలో నటించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తూ, ఇప్పటివరకు ఒక్క లిప్ కిస్ సీన్ లో కూడా నటించని రవితేజ లాంటి హీరో, ముద్దు…

కొంతమందికి లిప్ కిస్సులు కామన్. అలాంటి సీన్లలో నటించడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తూ, ఇప్పటివరకు ఒక్క లిప్ కిస్ సీన్ లో కూడా నటించని రవితేజ లాంటి హీరో, ముద్దు సీన్ లో నటిస్తే కచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది. గడిచిన 3 రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది కూడా. ఖిలాడీ సినిమాలో ఫస్ట్ టైమ్ ఓ లిప్ కిస్ సన్నివేశంలో నటించాడు రవితేజ. మరి ఈ లిప్ కిస్ సీన్ పై ఈ హీరో రియాక్షన్ ఏంటి?

“నేను ప్రొఫెషనల్ నటుడ్ని. నాకు ఎలాంటి పరిమితులు ఉండవు. క్యారెక్టర్ బట్టి చేసుకుంటూ వెళ్లిపోవడమే. కాబట్టి ఖిలాడీ సినిమాలో లిప్ లాక్ సీన్ అనేది ప్రొఫెషన్ లో భాగమే. ఆ సీన్ ఎందుకు చేశాను, ఎవరితో చేశాను లాంటి విషయాల్ని మాత్రం వెండితెరపై చూసి ఆనందించండి.”

ఖిలాడీ సినిమాలో రవితేజ లిప్ కిస్ సీన్, అందులో ఏ హీరోయిన్ పెదవుల్ని తన పెదవులతో ముద్దాడాడు అనే విషయం ఇప్పటికే బయటకొచ్చింది. కాకపోతే సినిమాలో ఇంకా 'విషయం' ఉందన్నట్టు రవితేజ రియాక్ట్ అవ్వడమే ఇక్కడ విశేషం. పైగా అలా మూతి ముద్దు పెట్టడం వెనక కూడా సీన్ డిమాండ్ చేసిందని చెబుతున్నాడు ఈ హీరో.

ఖిలాడీ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి అనే ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి నటించిన రవితేజ.. హీరోయిన్లకు తన ఇంటి భోజనం రుచి చూపించాడట. హీరోయిన్లిద్దరూ తన హోం ఫుడ్ ను బాగా ఎంజాయ్ చేశారని, అయితే ఆ తర్వాత మళ్లీ హీరోయిన్లతో కలిసి లంచ్ చేసే టైపులో షెడ్యూల్స్ పడలేదని చెప్పుకొచ్చాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది ఖిలాడీ.