మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలి

క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మహిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు ఈ వివాదం కార‌ణ‌మైంది. మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ వారి ఇష్టానికే వ‌దిలేయాల‌ని, ఇంకా క‌ట్టుబాట్లు ఏంట‌నే నిల‌దీత‌లు…

క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మహిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు ఈ వివాదం కార‌ణ‌మైంది. మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ వారి ఇష్టానికే వ‌దిలేయాల‌ని, ఇంకా క‌ట్టుబాట్లు ఏంట‌నే నిల‌దీత‌లు మ‌హిళ‌ల‌తో పాటు పౌర స‌మాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో హిజాబ్ వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌ను వివాదం చేయ‌డాన్ని ఆమె త‌ప్పు ప‌ట్టారు. మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. !! సందేశాన్ని చాటి చెబుతూ ఆమె ఓ క‌విత కూడా రాసి ఆక‌ట్టుకున్నారు.

హిజాబ్ వివాదం నేప‌థ్యంలో క‌విత ట్వీట్ ఏంటో చూద్దాం.

“స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుంది. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలి” అని క‌విత సూచించారు.

హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్, మతమేదైనా సరే, మనమంతా భారతీయులమే..అంటూ సాగిన క‌విత  హృద‌యావిష్క‌ర‌ణ పాఠ‌కుల్ని ఆలోచింప‌జేసేలా ఉంది.