సమంత ఆస్తులు అంతంత మాత్రమే

సినిమా వాళ్ల అందరి జీవితాలు రంగుల హరివిల్లులా వుండవు. పైగా కొందరి జీవితాలు పైకి ఒకలా..లోపల మరోలా వుంటాయి. వారి అందాలను మేకప్ గ్లోరిఫై చేసిన మాదిరిగానే ఆస్తుల విషయం కూడా అంత..ఇంత అనుకుంటూ…

సినిమా వాళ్ల అందరి జీవితాలు రంగుల హరివిల్లులా వుండవు. పైగా కొందరి జీవితాలు పైకి ఒకలా..లోపల మరోలా వుంటాయి. వారి అందాలను మేకప్ గ్లోరిఫై చేసిన మాదిరిగానే ఆస్తుల విషయం కూడా అంత..ఇంత అనుకుంటూ వుంటారు. కొందరి విషయంలో ఇవి నిజాలు. మరి కొందరి విషయంలో ఇవి కేవలం వట్టి గ్యాసిప్ లు.

హీరోయిన్ గా సమంత అనేక సినిమాలు చేసింది. చైతన్య ను పెళ్లి చేసుకుంది. బ్యాడ్ లక్ బ్రేకప్ తప్పలేదు. ఆ బ్రేకప్ తరువాత అనేక గ్యాసిప్ లు. సమంతకు 200 కోట్లు చైతన్య ఇచ్చాడనీ, లేదు మరో ఇన్ని కోట్లు లాగేసిందని, కాదు ఇంకా ఎంతో అని రకరకాల వార్తలు. కానీ వాస్తవాలు తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యంగానే వుంది. నిజానికి ఆమె పంతానికి పోయి రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది.

అందరు అనుకుంటున్నట్లు సమంత ఇప్పుడు చైతన్య నుంచి తీసేసుకున్న డ్యూప్లెక్స్ ఫ్లాట్ లో వుండడం లేదు. కేవలం అద్దె ఇంట్లో వుంటోంది. ఆ డ్యూప్లెక్స్ ఫ్లాట్ ను చైతన్య అమ్మేసినట్లు తెలుస్తోంది. చైతన్య జూబ్లీ హిల్స్ లో మాంచి స్వంత ఇల్లు కట్టుకుంటున్నాడు. సమంత అద్దె ఇంట్లో వుంటోంది. వీలైతే ఆ ఫ్లాట్ అమ్మితే కొనుక్కోలనుకుంటోంది.

సమంతకు చెన్నయ్ లో, హైదరాబాద్ లో చెరో అపార్ట్ మెంట్ వున్నాయి. వాటివల్ల పెద్దగా ఆదాయం ఏమీ వచ్చి పడిపోతుంది. జ‌స్ట్ వేలల్లో మాత్రమే వస్తుంది. హైదరాబాద్ ఎస్ఎల్ఎన్ క్లాంప్లెక్స్ లో ఓ కమర్షియల్ ప్రాపర్టీ వుంది. దాని నుంచి మాత్రం కాస్త అద్దె వస్తుంది. ఇంతకు మించిన ఆస్తులు ఏమీ లేవు.

అప్పట్లో హీరోయిన్లకు పెద్దగా రెమ్యూనిరేషన్లు వుండేవి కాదు. అందువల్ల సమంత పెద్దగా వెనకేసుకోలేదు. అంతకు ముందు ఒకర్ని నమ్మి దెబ్బతినడం కూడా ఇందుకు ఓ రీజ‌న్ అని తెలుస్తోంది. ఇప్పుడు సమంత శాకుంతల సినిమా ఫినిష్ చేసి, యశోద సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత ఏం చేస్తారు అన్నది ఇప్పటి వరకు అధికారికంగా ఇంకా ఫిక్స్ కాలేదు. అన్నీ చర్చల్లోనేే వున్నాయి.