రామబాణం ప్రచారం కోసం గోపీచంద్-తేజను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ చాలా మంది ఐడియా. బాగా రీచ్ అయ్యే ఐడియా. కాకపోతే అలా ఆలోచించిన వాళ్లు తేజను కట్టడిచేయలేమనే విషయాన్ని గ్రహించలేకపోయారు. దీంతో ఇంటర్వ్యూలో తేజ విజృంభించాడు. ఒక దశలో గోపీచంద్ కు నోట మాట రాలేదు.
ఇవన్నీ టీజర్ లో చూపించారు. ఆ ప్రోమో తెగ వైరల్ అయింది. వందల థంబ్ నెయిల్స్, హెడ్డింగ్స్ పుట్టుకొచ్చాయి. దీంతో అసలు విషయం గ్రహించారు. రామబాణం సైడ్ అయిపోతోందని తెలుసుకున్నారు. ఆ ప్రభావం టోటల్ ఇంటర్వ్యూపై పడింది. కొద్దిసేపటి కిందట గోపీచంద్-తేజ ఇంటర్వ్యూను విడుదల చేశారు.
ఇంటర్వ్యూను ఆసాంతం చూస్తే ఎన్ని కట్స్ పడ్డాయో ఈజీగా ఆర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రోమోలో కనిపించిన మేటర్ దాదాపు 90శాతం ఇంటర్వ్యూలో లేదు. “నువ్వు ఏం పీకావ్” లాంటి పదజాలంతో పాటు ఇబ్బంది అవుతుందేమో అనే సందేహం వచ్చిన ప్రతి ముక్కను కట్ చేసి పడేశారు.
ఇంతోటి దానికి తేజను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం ఎందుకు? సగటు యాంకర్ ను ఎవ్వర్ని కూర్చోబెట్టినా అవే సమాధానాలు వస్తాయి. ఓవరాల్ గా చెప్పొచ్చేదేంటంటే, గోపీచంద్ కెరీర్ కు పునాదిగా నిలిచిన తేజ లాంటి వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టి ఎలాంటి పస లేని స్టఫ్ ను బయటకు వదిలారు. ఓ మంచి కాంబినేషన్ ను వృధా చేశారు.